బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తాజాగా ఫస్ట్ వీక్ ముగిసింది.ఈ క్రమంలోనే సండే ఫండే అంటూ కంటెస్టెంట్ లను నవ్వించడానికి హోస్ట్ నాగార్జున వచ్చారు.
ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లందరితో టాస్క్ లు ఆడించాడు.ఇక మొదటి ఎలిమినేషన్ లో భాగంగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది.
ఇక ముమైత్ ఖాన్ బదులు తాను వెళ్ళిపోతాను అన్న భ్రమలో సరయు కూడా బోరున ఏడ్చేసింది. సరయు తాను సేఫ్ అని తెలిసినప్పటికీ కూడా ఏడ్చేసింది.
ఇది ఇలా ఉంటే ఛాలెంజర్స్ వారియర్స్ మధ్య డాన్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

వారియర్స్ ఛాలెంజర్స్ లో నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెస్టెంట్ ను సెలెక్ట్ చేసుకొని డాన్స్ చేయాలి అని ఆదేశించాడు బిగ్ బాస్.అలా యాంకర్ శివ- తేజస్వి, అరియానా- చైతూ, అఖిల్ బిందు మాధవి, అషు, స్రవంతి ఇలా ఒక్కొక్క జోడి పర్ఫామెన్స్ ఇరగదీసారు.ఈ జోడి లలో ఆర్జే చైతు, అరియానా డాన్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
వారి డాన్స్ పర్ఫార్మెన్స్ మీద హోస్ట్ నాగార్జున ఇచ్చిన మార్కులు, అదేవిధంగా చైతు వేసిన కౌంటర్ అదిరిపోయాయి.అరియానా కు 9 మార్కులు ఇవ్వగా చైతూకి ఎనిమిది మార్కులే ఇచ్చాడు.
దీనితో చైతు కౌంటర్ వేసాడు.
మీరు మార్కులు ఇచ్చింది అరియానా డాన్స్ కా లేక నడుముకా?సార్ అని అడగగా కరెక్టుగా చెప్పావు అరియానా నడుముకే అన్నట్టుగా నాగార్జున సెటైర్ వేసాడు.ఇక తేజస్వీతో డ్యాన్స్ చేయడానికి యాంకర్ శివ బాగానే కష్టపడ్డాడు.కానీ తేజస్వీ మాత్రం మాస్ స్టెప్పులతో దుమ్ములేపేసింది.అయితే యాంకర్ శివ చేసిన ధైర్యానికి నాగార్జున తొమ్మిది మార్కులు వేశాడు.తేజస్వీకి కూడా తొమ్మిది మార్కులే ఇచ్చాడు.