అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) ఒక దశలో వరుస విజయాలతో ఇతర హీరోలను సైతం షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే.నాగార్జున క్లాస్, మాస్, కామెడీ ఇలా ఏ సినిమాలో నటించినా ఆ సినిమా సక్సెస్ సాధించి నాగ్ మార్కెట్ ను మరింత పెంచడం జరిగింది.
అయితే గత కొన్నేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.కొత్త హీరోల ఎంట్రీతో సీనియర్ హీరోల మార్కెట్ తగ్గింది.
సినిమాలకు హిట్ టాక్ వస్తున్నా భారీగా రికార్డులు క్రియేట్ చేయడంలో సీనియర్ స్టార్ హీరోలు తడబడుతుండటం గమనార్హం.
వరుస ఫ్లాపుల తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న నాగ్ మళ్లీ కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.
ప్రసన్న కుమార్( Prasanna Kumar) డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అమ్మాయి వయస్సు 26 సంవత్సరాలు అని తెలుస్తోంది.నాగ్ వయస్సు ప్రస్తుతం 63 సంవత్సరాలు కాగా 37 సంవత్సరాల కంటే చిన్న వయస్సు ఉన్న అమ్మాయికి జోడీగా నాగ్ నటిస్తున్నారు.

ఇలా ఉండటం వల్ల కొన్నిసార్లు ఈ జోడీలు ఎబ్బెట్టుగా ఉంటున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మానస( manasa ) అనే హీరోయిన్ నాగ్ కు జోడీగా కనిపించనున్నారు.మిస్ వరల్డ్ 2021లో మన దేశం తరపున ఈ బ్యూటీ ప్రాతినిథ్యం వహించారు.ఈ సినిమాలో నాగ్ పాత్రల్లో వేరియేషన్స్ ఉంటాయని సమాచారం అందుతోంది.ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కావాల్సి ఉంది.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే నాగ్ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.నాగార్జున తన సినీ కెరీర్ లో మెమరబుల్ గా ఉండేలా ఈ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని నాగ్ ఆశ పడుతున్నారు.







