న్యూస్ రౌండప్ టాప్ 20

1.వైఎస్ వివేకా హత్య కేసు


 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Cm Kcr,mi-TeluguStop.com
Telugu Bandi Sanjay, Cm Kcr, Cm Ys Jagan, Delhi, Gold, Jaganannemaa, Ktr, Pawan

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసులో సంబంధం ఉన్నట్టుగా అనుమానిస్తున్న  ఆయన సోదరుడు వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.వివేక హత్య కేసులో ఏ4 నిందితుడు దస్తగిరిని అప్రూవల్ గా ప్రకటించడాన్ని  సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

2.విమానం అత్యవసర లాండింగ్

సాంకేతిక లోపంతో టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్( Bangalore International Airport ) లో విమానం ల్యాండింగ్ అయింది.బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి అబుదాబికి 200 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎతిహాద్ ఎయిర్ వేస్ విమానం సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది.

3.పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన


Telugu Bandi Sanjay, Cm Kcr, Cm Ys Jagan, Delhi, Gold, Jaganannemaa, Ktr, Pawan

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan )తన రెండో రోజు పర్యటనలో బిజెపికి చెందిన ప్రముఖులను కలవనున్నారు.

4.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  మంగళవారం శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

5.వెంకట్ రెడ్డి పై హైకోర్టులో ఈరోజు విచారణ

కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  చెరుకు సుధాకర్ వ్యవహారంలో చెరుకు సుధాకర్ కుమారుడికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) ఫోన్ చేసిన ఆడియో క్లిప్ వైరల్ గా మారింది.దీనిపై వెంకటరెడ్డి పై కేసు నమోదు చేయాలని చెరుకు సుధాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై నేడు విచారణ జరగనుంది.

6.కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్


Telugu Bandi Sanjay, Cm Kcr, Cm Ys Jagan, Delhi, Gold, Jaganannemaa, Ktr, Pawan

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( BJP Chief Bandi Sanjay )సవాల్ చేశారు.  దమ్ముంటే డిగ్రీ సర్టిఫికెట్స్ బయట పెట్టాలంటూ సంజయ్ కేటీఆర్ కు సవాల్ విసిరారు.

7.ఒంటిమిట్టకు జగన్

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు సందర్భంగా వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) రేపు బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు.

8.ఏపీ సెట్ లో మళ్లీ ఇంటర్ వెయిటేజీ

ఆంధ్రప్రదేశ్ లోని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులు ప్రవేశానికి నిర్వహించే ఈ ఏపీ సెట్ 2023 లో ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించారు.

9.వల్లభనేని వంశీ కామెంట్స్


Telugu Bandi Sanjay, Cm Kcr, Cm Ys Jagan, Delhi, Gold, Jaganannemaa, Ktr, Pawan

నిన్న జరిగిన సీఎం జగన్ సమీక్షకు గైర్హాజరు కావడంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు.ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్( Indian School of Business ) లో కోర్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరీక్షలు జరుగుతున్నాయని,  అందుకే తాను హాజరు కాలేదంటూ వంశి అన్నారు.

10.పదో తరగతి పరీక్షల పై మంత్రి స్పందన

పదో తరగతి పరీక్షల పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Sabitha Indrareddy ) స్పందించారు.పదో తరగతి పరీక్షల విషయంలో జిల్లా కలెక్టర్లు,  విద్యాశాఖ,  ఉపాధ్యాయులు ,పాఠశాల యాజమాన్యాలు,  పోలీసులు పోస్టల్ డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్యశాఖ ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆమె కోరారు.

11.పవన్ కళ్యాణ్ కామెంట్స్

ఢిల్లీ లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పర్యటన స్పందించారు.బిజెపి కీలక నేతలందరినీ కలిసిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతాను అంటూ ఆయన మీడియాకు తెలిపారు.

12.హిందీ ప్రశ్నాపత్రం లీక్ కాలేదు


Telugu Bandi Sanjay, Cm Kcr, Cm Ys Jagan, Delhi, Gold, Jaganannemaa, Ktr, Pawan

వరంగల్ జిల్లాలో పదవ తరగతి హింది ప్రశ్నపత్రం( Hindi Question Paper )వాట్సాప్ లో లీక్ అయిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి డీఈవోలు తెలిపారు.

13.జీవో నెంబర్ 45 పై మద్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో కలెక్టర్లకు భూమిని బదిలీ చేసేందుకు సిఆర్డిఏ కమిషనర్ కు అనుమతులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 45( GO Number 45 ) సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది.దీనిపై మద్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హై కోర్ట్ నిరాకరించింది.

14.మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కామెంట్స్


Telugu Bandi Sanjay, Cm Kcr, Cm Ys Jagan, Delhi, Gold, Jaganannemaa, Ktr, Pawan

రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ మోహన్ రెడ్డి తోనే కొనసాగుతానని , వైఎస్సార్ సీపీ కి ఎవరు నన్ను దూరం చేయలేరు అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి( MLA Alla Ramakrishna Reddy ) అన్నారు.

15.కెసిఆర్ పై లక్ష్మణ్ విమర్శలు

తెలంగాణలో అసలు ప్రభుత్వ అధినేతగా సీఎం కేసీఆర్( CM KCR ) ఉన్నారా.

అసలు పాలన సాగుతుందా అని బిజెపి పార్లమెంటరీ బోర్డ్ సభ్యుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు.

16.మంత్రి అప్పలరాజు కామెంట్స్

మొన్న మంత్రి పదవి తీసేస్తారని ప్రచారం చేశారు.ఈరోజు ఎమ్మెల్యేగా పీకేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు.పలాస ఎప్పటికీ వైఎస్ఆర్సిపి అడ్డానే అంటూ ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు( Sidiri Appalaraju ) అన్నారు.

17.‘జగనన్నే మా భవిష్యత్ ‘ పోస్టర్ విడుదల


Telugu Bandi Sanjay, Cm Kcr, Cm Ys Jagan, Delhi, Gold, Jaganannemaa, Ktr, Pawan

జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం పోస్టర్ ను ప్రభుత్వ సలహాదారు,  వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.

 18.వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రత్యేక గుర్తింపు

అత్యధిక జనాదరణ కలిగిన రైలుగా వందే భారత్( Vande Bharat )కు గుర్తింపు లభించింది.రికార్డు స్థాయిలో కార్గో హ్యాండ్లింగ్ చేసిన రైల్వే డివిజన్ గా వాల్తేరు డివిజన్ కొత్త రికార్డు సృష్టించింది.

19.షర్మిల పై తమ్మినేని ఆగ్రహం

షర్మిల రాజకీయ నాటకాలు మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం( Tammineni Veerabhadram ) విమర్శించారు.

20.ఈరోజు బంగారం ధరలు


Telugu Bandi Sanjay, Cm Kcr, Cm Ys Jagan, Delhi, Gold, Jaganannemaa, Ktr, Pawan

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,300

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 60,330

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube