ప్రస్తుతం తెలుగు సినిమా రేంజ్ పెరిగింది.ఇండియన్ సినిమాల్లో తెలుగు చిత్ర పరిశ్రమనే అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇండియన్ సినిమాను శాసించే బాలీవుడ్ ను సైతం వెనక్కి నెట్టి తెలుగు చిత్ర పరిశ్రమ ముందు వరుసలోకి వచ్చింది.అయితే ఒకప్పటితో పోలిస్తే తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.
ఒకప్పుడు కథతో సంబంధం లేకుండా కేవలం హీరోపైనే దృష్టి పెట్టి హీరో చుట్టూనే కథ అల్లుకుంటూ మితిమీరిన హీరోయిజాన్ని చూపించే వారు తెలుగు సినీ దర్శకులు, ( Tollywood Directors ) అప్పటి ఆడియన్స్ కూడా ఇలాంటి అలాంటి హీరోయిజాన్నే కోరుకునే వారు.దాంతో తెలుగులో డిఫరెంట్ కథలు రావని, ముఖ్యంగా రియాలిటీకి దగ్గరగా ఉండే రా అండ్ రాస్టిక్ మూవీస్ తీయడం తెలుగు దర్శకులకు చేత కాదని ఇలా రకరకలుగా ఎన్నో విమర్శలు వినిపించాయి.
మరోవైపు తమిళ్ మేకర్స్( Tamil Makers ) మాత్రం రూరల్ బ్యాక్ డ్రాప్ లో రియాలిటీ టచ్ ఇస్తూ సినిమా అంటే వాస్తవానికి ప్రతిరూపం అనెంతల రియాలిటికి దగ్గరగా మూవీస్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ విధంగా తమిళ్ దర్శకుల మాదిరి రియాలిటికి దగ్గరగా మూవీస్ తీసే దర్శకులు తెలుగులో లేరా అనే భావనా చాలా మందిలో ఉండేది.
అయితే ప్రస్తుతం తెలుగులో రియాలిటికి దగ్గరగా మూవీస్ తీసే దర్శకుల సంఖ్య రోజురోజుకూ పొరుగుతోంది.

రంగస్థలం మూవీతో సుకుమార్ ( Sukumar ) విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కు సరికొత్త బాటా వేశారు.ఈ మూవీలో రాంచరణ్ నటన.సుకుమార్ మేకింగ్ సినీ ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని పంచింది.ఆ మూవీస్ చూసే ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారిందనే చెప్పాలి.రియాలిటీకి దగ్గరగా ఉంటేనే మూవీస్ ను హిట్ చేస్తున్నారు ఆడియన్స్.దాంతో దర్శకులు కూడా మితిమీరిన హీరోయిజనికి పులిస్టాప్ పెట్టి రియాలిటికి దగ్గరగా కథలు రూపొందించడానికి మొగ్గు చూపుతున్నారు.

ఆ కోవలోనే పుష్ప మరియు ఇటీవల రిలీజ్ అయిన దసరా( Dasara ) మూవీస్ ను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.అయితే ఈ మూవీస్ పై తమిళ్ సినిమాల ప్రభావం ఉందనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది.అయితే తెలుగులో కూడా రియాలిటీకి దగ్గరగా మూవీస్ తీసే సత్తా తెలుగు దర్శకుల్లో ఉందని ఈ సినిమాలతో నిరూపితం అయింది.
ఇక రాబోయే రోజుల్లో తెలుగులో కూడా రా అండ్ రాస్టిక్ మూవీస్ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.ఏది ఏమైనప్పటికి ఈ రకమైన జోనర్ మూవీస్ తెలుగులో కూడా రూపొందడం శుభపరిణామమే.







