భగవంతుడా ఇక ప్రేక్షకులను నువ్వే కాపాడాలి అన్నట్టుగా కన్నడ సినిమా( Kannada movie ) ఇండస్ట్రీ ని కూడా ఆ దేవుడే కాపాడాలి.ఎందుకంటే ఇప్పటికే పాన్ ఇండియా పేరుతో కేజిఎఫ్ ( KGF )సినిమాలు, కాంతారా( Kantara ) వంటివి హల్చల్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
వాటికి స్పూఫ్ లాగా ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చిందా ఏంటి అనే అనుమానం వచ్చే విధంగా ప్రస్తుతం కబ్జా సినిమా( Kabja ) కనిపిస్తుంది.తెలుగువారికి నిన్న మొన్నటి వరకు కన్నడ నటులు ఎవరు పెద్దగా పరిచయం లేదు కన్నడ సినిమాల గురించి కూడా మనకు తెలియదు కేవలం ఉపేంద్ర ఆ తర్వాత ఈగ వంటి చిత్రాలతో కిచ్చా సుదీప్( Kiccha Sudeep ) తెలుసు ఆ తర్వాత ఇటీవల సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతో ఉపేంద్ర మరోసారి హల్చల్ చేశాడు అయితే ఇప్పుడు ఉపేంద్ర సుదీప్ లాంటి నటులందరూ కలిసి తీసిన సినిమా కబ్జా.
కథలను కాపీ కొట్టడం ఒక ఎత్తు అయితే కాపీ కొట్టిన కథను ప్రేక్షకుడికి అర్థం కాని విధంగా తెలివిగా తీయడం మరొక ఎత్తు.అయితే కబ్జా సినిమాను చూస్తే దర్శకుడు పూర్తిగా కన్నడ ప్రేక్షకులను మోసం చేయడానికి కూడా పనికిరాడు అన్నట్టుగా కనిపించాడు ఎందుకంటే కే జి ఎఫ్ సినిమాను అచ్చుగుద్దినట్టు తీశాడు ఇప్పటికీ ఓటీటి లో ఆ చిత్రం అందుబాటులోనే ఉంది మరోసారి థియేటర్ కి వెళ్లి ఎవరు చూస్తారు చెప్పండి అందువల్లే కబ్జా సినిమాకు ఓపెనింగ్స్ అస్సలు లేవు.సినిమాను క్లైమాక్స్ నడుస్తుంటే మధ్యలో ఆపేసి మిగతా భాగం రెండవ పార్ట్ లో చూడండి అని చెప్పేంత దమ్ము కన్నడ వారికి మాత్రమే ఉంది అందుకే ఈ సినిమాకు కూడా పార్ట్ 2 తీయబోతున్నారని తెలుస్తోంది.ఒక్కసారి చూడడానికే జనాలు కళ్ళు చెవులు మూసుకుంటే రెండవ పాట తీస్తారు అంటే పారిపోవడం మాత్రం ఖాయం.
కోట్లకు కోట్లు డబ్బు ఖర్చు పెట్టి స్టార్ హీరోలను స్టార్ కాస్టింగ్ పెట్టుకుని ఇలాంటి సినిమా తీయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది అర్థం కావట్లేదు.పైగా కన్నడ ఇండస్ట్రీలోనే పాన్ ఇండియా చిత్రాలు తీస్తున్నారు వారిని చూసైనా సరే ఒక మంచి సినిమా తీస్తే హిట్ అవుతుంది కానీ ఇలా తలా తోక లేని సినిమా తీసి జనాలపై రుద్దడం ఎందుకు.ఉపేంద్ర( Upendra ) పై కాస్త కూసో అభిమానం ఉన్నవారికి ఈ సినిమాతో పూర్తిగా అది కూడా పోతుంది.కే జి ఎఫ్ సినిమా వచ్చేవరకు కన్నడ పరిశ్రమ గురించి బయట వారికి తక్కువగానే తెలిసేది.
ఈ సినిమా చూసిన తర్వాత వీరి తెలివితేటలు ఈ రేంజ్ లో ఉన్నాయా అని అర్థమవుతుంది అందుకే కన్నడ గురించి అంతగా ఎవరికి తెలియకుండా పోయింది.