ఇటీవలే కాలంలో వివాహం తర్వాత 90 శాతం కంటే ఎక్కువ మహిళలు భర్త, అత్తమామల చేతులలో చిత్రహింసలకు గురవుతున్నారు.ఇక ఏవైనా కారణాలు ఉంటే ఆ మహిళలకు నరకమే చూపించేస్తారు.
వివాహం జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం కలగకపోవడంతో భర్త తాగి వచ్చి భార్యను చిత్రహింసలు పెడుతూ ఉండడంతో విస్తుపోయిన భార్య వేడినీళ్లలోకారంపొడి కలిపి భర్తను హతమార్చింది.పోలీసులు తెలిపి వివరాల ప్రకారం తమిళనాడులోని సేలం జిల్లాలోని భారతిపురంలో నివాసం ఉండే సెల్వరాజ్( Selvaraj ) (27) కు, అదే ప్రాంతానికి చెందిన డయానా మేరీ( Diana Marie ) (22) తో వివాహం జరిగింది.
సెల్వరాజ్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ, సంతానం కలగలేదని మద్యం తాగి తరచూ భార్యతో గొడవ పడేవాడు.

భర్త పెట్టే చిత్రహింసలను భరించలేక మూడు నెలల క్రితం మేరీ పుట్టింటికి వెళ్ళింది.పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి సర్ది చెప్పినా కూడా సెల్వ రాజ్ లో ఎటువంటి మార్పు రాలేదు.సెల్వరాజ్ మారడు అన్న విషయం గ్రహించిన మేరీ కాపురానికి వెళ్లకుండా పుట్టింటిలోనే ఉండిపోయింది.
మార్చి 5న సెల్వరాజ్ అత్తారింటికి వెళ్లి మేరీని కాపురానికి రావాల్సిందిగా కోరాడు.అందుకు మేరీ అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.
మేరీ కుటుంబ సభ్యుల ముందే, మేరీ ను కొట్టాడు.కోపంతో రగిలిపోతున్న మేరీ అప్పటికే స్టవ్ మీద వేడినీళ్లలో కారంపొడి కలిపి పెట్టి ఉంచింది.
భర్త చేయి చేసుకున్న అనంతరం వెంటనే ఆ వేడినీళ్లు సెల్వరాజ్ ముఖంపై కొట్టడంతో.సెల్వరాజ్ నొప్పి తట్టుకోలేక కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారంతా వచ్చి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా శుక్రవారం ఉదయం ప్రాణాలు విడిచాడు.తన భార్య మేరీ తనపై వేడి నీళ్లలో కారం కలిపి ముఖంపై కొట్టిందని సెల్వరాజ్ చెప్పడంతో పోలీసులు మేరీ, మేరి తల్లి ఇన్నాసియమ్మళ్( Innasiamal ) (43) అదుపులోకి తీసుకున్నారు.
అయితే సెల్వరాజ్ భార్య పేరుతోనే కాకుండా అత్తతో కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.








