కాజల్‌కు ఆ ఫింగర్ ఎందుకు చూపించావ్.. నాగార్జున ప్రశ్న?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం నేటితో ఐదో వారం కూడా పూర్తి కానుంది.

ఈ క్రమంలోనే శనివారం హౌస్ సభ్యులతో మాట్లాడిన నాగార్జున వారం రోజులలో కంటెస్టెంట్ లో పడిన గొడవలు గురించి ప్రశ్నించారు.

ఇక ఈ వారంలో కాజల్ కంటెస్టెంట్ రవి లోబోలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది.దీంతో రవి కాజల్ మధ్య గొడవ చోటు చేసుకోవడమే కాకుండా, లోబోతో కూడా వివాదం జరుగుతుంది.

ఈ క్రమంలోనే లోబో కాజల్ ను ఉద్దేశిస్తూ మిడిల్ ఫింగర్ చూపిస్తాడు.ఈ మిడిల్ ఫింగర్ విషయమై కాజల్ లోబో రవితో గొడవ పడుతుంది.

ఇక శనివారం హౌస్మేట్స్ తో మాట్లాడిన నాగార్జున ఇదే విషయం గురించి ప్రశ్నిస్తాడు.ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రియా, అనీ మాస్టర్ ని అడుగుతూ లోబో నిజంగానే మిడిల్ ఫింగర్ చూయించాడా అని ప్రశ్నించగా ప్రియా అంతగా గమనించలేదు అని సమాధానం చెప్పగా, అనీ మాస్టర్ వేలు అయితే కాస్త డిఫరెంట్ గా పెట్టాడని చెబుతుంది.

Advertisement

అయితే లోబో మాత్రం పైన బల్లి ఉంటే వేలు చూపించాను కానీ తనను ఉద్దేశిస్తూ వేలు చూపించలేదని సమాధానం చెప్పాడు.ఈ క్రమంలోనే నాగార్జున ఆ వీడియోను ప్లే చేసి చూపించగా లోబో కావాలనే కాజల్ ను ఉద్దేశిస్తూ వేలు చూపించలేదని.చెప్పడంతో ఈ గొడవంతా అంతటితో ముగిసిపోతుంది.

ఇకపోతే నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ వేదికపై కొండపొలం టీమ్ సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.మరి నేటి ఎపిసోడ్ లో భాగంగా హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు