అఫిషియల్ : సంక్రాంతికే ''నా సామిరంగ''.. మూడు రోజుల్లో ఎప్పుడు రాబోతుందంటే?

సంక్రాంతి సీజన్ కోసం టాలీవుడ్( Tollywood ) మొత్తం సిద్ధం అవుతుంది.ఈసారి మొత్తంగా టాలీవుడ్ నుండే 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి.

దీంతో పొంగల్ రేసు మరింత రసవత్తరంగా ఉంది.మరి ఈ సినిమాలు చూస్తుంటే ఒక్కటి కూడా తగ్గేలా కనిపించడం లేదు.

ఈసారి సంక్రాంతి కానుకగా మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జ హనుమాన్, నాగార్జున నా సామిరంగ, రవితేజ ఈగల్ బరిలోకి దిగనున్నారు.మరి ఈ సినిమాల పోటీ వల్ల థియేటర్స్ దగ్గర క్లాషెస్ తప్పేలా లేదు.

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు నాగార్జున నా సామిరంగ ( Naa Saami Ranga) సినిమా మాత్రం సంక్రాంతికి అని చెప్పిన డేట్ ఫిక్స్ చేసుకోలేదు.దీంతో ఏమైనా ఈ సినిమా వెనక్కి తగ్గిందేమో అనే అనుమానాలు వచ్చాయి.

Advertisement

కానీ ఎట్టకేలకు ఈ సంక్రాంతికి మేము కూడా ఉన్నాం అంటూ నా సామిరంగ రిలీజ్ డేట్ కొద్దిసేపటి క్రితం అఫిషియల్ గా క్లారిటీ వచ్చేసింది.

ఈ సినిమాను పొంగల్ రేసులో నిలబోతున్నట్టు పండుగ మూడు రోజుల్లో ఒక రోజును ఫిక్స్ చేసారు.ఇప్పటి వరకు సస్పెన్స్ గా ఉన్న ఈ సినిమాను జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు టైటిల్ ప్రోమోతో ప్రకటించారు.దీంతో ఇప్పుడు ఈ సినిమా కూడా ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేయనుంది.

కాగా ఈ సినిమాలో రాజ్ తరుణ్, అల్లరి నరేష్, మిర్నా మీనన్ ( Mirnaa Menon ) కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇక విజయ్ బన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ ( Ashika Ranganath ) హీరోయిన్ గా నటిస్తుంది.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement
https://youtu.be/Z3iL2nhISgA

తాజా వార్తలు