కొడుకు కోసం బరిలోకి దిగుతున్న కింగ్

ప్రస్తుతం నాగ చైతన్య ప్రేమమ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.చైతన్య ప్రేమకథలకు బాగా సెట్ అవుతాడు.

అలాగే తన కెరీర్ లో హిట్ వచ్చిన సినిమాలు కూడా ప్రేమ కథలే.అందుకే మలయాళంలో గొప్ప లవ్ స్టోరీగా నిలిచిన ప్రేమమ్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు.

చైతూ కెరీర్ ని హైప్ తీసుకురావటానికి ఈ సినిమాలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్స్ జోడిస్తున్నారు.చైతన్య మేనమామ అయిన వెంకటేష్ ఒక చిన్న రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరో ఆసక్తికరమైన న్యూస్ ఏమిటంటే ఈ సినిమాలో నాగ్ కూడా మెరవనున్నాడు.అయితే నాగ్ సినిమాలో చివర్లో వచ్చి చైతన్య నా కొడుకే అని చెప్పే సన్నివేశంలో కనపడతాడని సమాచారం.

Advertisement

ఇక వెంకీ మలయాళంలో రెంజి పానికర్ పోషించిన పాత్రలో కనిపించనున్నాడు.ఈ నెల 29న ‘ప్రేమమ్’ ఆడియో ని విడుదల చేసి సెప్టెంబర్ లో సినిమా విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ‘కార్తికేయ’ ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు