నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ స్టోరీ సినిమాను ఏడాదిలో విడుదల చేసే అవకాశం లేదని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.శేఖర్ కమ్ముల సినిమాలకు ఓవర్సీస్‌లో ఎక్కువ బిజినెస్ ఉంటుంది.
అందుకే ఈ సినిమాను ఓవర్సీస్ మార్కెట్‌కు తగ్గట్లుగా విడుదల చేయాలని భావిస్తున్నారు.అమెరికాలో ఈ సినిమా ఖచ్చితంగా 8 నుండి 10 కోట్ల వరకు వసూళ్లు చేస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు.
ఈ ఏడాదిలో అమెరికాలో సినిమాలు విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.అందుకే ఈ సినిమాను వచ్చే ఏడాది వరకు ఆగి మరి విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
అమెరికాలో కరోనా పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అందుకే ప్రతి ఒక్క పని కూడా అక్కడ ఆగిపోయింది.వచ్చే ఏడాది వరకు అక్కడ పరిస్థితులు కుదుట పడే అవకాశం లేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమాను విడుదల చేయడం దాదాపుగా అసాధ్యం అంటున్నారు.పెద్ద ఎత్తున సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ఈ సమ్మర్‌కు రెడీ అయ్యారు.కాని ఈ సమ్మర్ మొత్తం వృదా అవుతోంది.
సినిమాలు విడుదల కాకపోవడం మాత్రమే కాకుండా వచ్చే ఏడాది వరకు బొమ్మ పడే పరిస్థితి లేదు.జులై ఆగస్టు వరకు థియేటర్లు ఓపెన్ అయినా కూడా అప్పుడు కూడా సినిమాలు విడుదల అవుతాయో లేదో అనేది చూడాలి.
నాగచైతన్య లవ్ స్టోరీ మాత్రం వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయడం ఖాయం అంటున్నారు.నెల రోజుల్లోనే ఈ సినిమా పని పూర్తి అవ్వనుంది.
అయినా కూడా ఆలస్యంగా విడుదల చేయబోతున్నారు.