“మా” అధ్యక్ష ఎన్నికల బరిలోకి చాలా లేట్ గా ఎంట్రీ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ ప్యానల్ కి సపోర్ట్ ఇస్తున్న సంగతి తెలిసిందే.తాను మాత్రమే కాక మెగా హీరోలు చిరంజీవి సపోర్ట్.
ప్రకాష్ రాజ్ కి ఉన్నట్లు బహిరంగంగా ఇటీవల ప్రకటన చేయడం జరిగింది.ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ లోకల్ వాడు కాదని.
డైలాగులు వేయడం సరైన విధానం కాదని, భారతీయ నటుడు అంటూ నాగబాబు రియాక్ట్ అయ్యారు.ఇక ఇదే తరుణంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో. మంచు విష్ణు నామినేషన్ వేసిన తర్వాత ప్రకాష్ రాజ్ పై చేసిన వ్యాఖ్యలను తాజాగా నాగబాబు ప్రస్తావించారు.
మంచు విష్ణు అప్పట్లో ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ వైపు ఉన్నాడా.? పవన్ కళ్యాణ్ వైపు ఉన్నాడా.? అంటూ చేసిన వ్యాఖ్యలను తాజాగా లేవనెత్తి అది పూర్తి రాంగ్ స్టేట్మెంట్ అని, విష్ణు ఇండస్ట్రీని రెండు ముక్కలుగా చేసి రీతిలో మాట్లాడారని వెంటనే ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు.ఇదే తరుణంలో నరేష్ నాలుక… నరం లేని నాలుక అంటే కూడా నాగబాబు సెటైర్లు వేయడం జరిగింది.అదే రీతిలో మంచు విష్ణు మేనిఫెస్టో పై కూడా సీరియస్ అయ్యారు.
కొత్త బైలాస్ తీసుకొచ్చి ప్రస్తుతం “మా” లో ఉన్న సభ్యులు తీసివేసి కొత్త వారిని జాయిన్ చేసుకునే ఆలోచనలో ఉన్నారా .? అంటూ సంచలన ప్రశ్నలు లేవనెత్తారు నాగబాబు.