కరివేపాకు అంటూ అందరి ముందు ధనరాజ్ ను అవమాన పరిచిన నాగబాబు!

బుల్లి తెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసరమవుతూ పెద్ద ఎత్తున బుల్లి తెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే స్టార్ మాలో పార్టీ చేద్దాం పుష్ప అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి అనసూయ, సుధీర్ యాంకర్లుగా సందడి చేశారు.ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా కమెడియన్స్ పెద్ద ఎత్తున తమ కామెడీ స్కిట్ తో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ ప్రోమోలో భాగంగా నాగబాబు అందరి ముందు కమెడియన్ ధనరాజ్ ను కరివేపాకు అంటూ అవమానపరిచారు.

ఇలా నాగబాబు ధనరాజ్ ను ఎందుకు కరివేపాకు అంటూ అవమానపరిచారు అనే విషయానికి వస్తే.ధనరాజ్ కరివేపాకు చేతిలో పట్టుకొని స్వామీజీ వేషధారణలో స్కిట్ చేశారు.

Advertisement

ఈ క్రమంలోనే ధనరాజ్ అనసూయతో మాట్లాడుతూ అనసూయా నేను నీకేమైనా అప్పు ఉన్నానా అని అడిగారు.ఆ మాటకు అనసూయా అలాంటిది ఏమీ లేదు.

అయినా ఎందుకు అలా అడుగుతున్నావ్ అని అడగగా ఎందుకో రోజు రోజుకు నీమీద నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటూ కామెంట్స్ చేశారు.

ఈ విధంగా ధనరాజ్ అనసూయతో అలా మాట్లాడగానే వెంటనే నాగబాబు ఆపరా కరివేపాకు అంటూ నాగబాబు అందరి ముందు పరువు తీశారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వినోదం చూడాలంటే ఆదివారం వరుకు వేచి చూడాలి.

జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్న నాగబాబు ప్రస్తుతం స్టార్ మా లో సందడి చేస్తున్నారు.ఈయన ప్రస్తుతం ఈయన కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు