యువ హీరో నాగ శౌర్య లీడ్ రోల్ లో అనీష్ కృష్ణ డైరక్షన్ లోవస్తున్న సినిమా కృష్ణ వ్రిందా విహారి.టైటిల్ తోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన ఈ మూవీ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
సినిమాలో నాగ శౌర్య సరసన సిర్లే సెటియా హీరోయిన్ గా నటించింది.సినిమాకు చలో మ్యూజిక్ డైరక్టర్ మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు.
సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.మరో 3 రోజుల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో డైరక్టర్ అనీష్ కృష్ణ నాగ శౌర్య ని పొగడ్తలతో ముంచెత్తాడు.
ఈ సినిమాలో నాగ శౌర్య బాగా నటించాడని.తప్పకుండా సినిమాలో అతని విశ్వరూపం చూస్తారని చెప్పాడు.
అయితే వరుస ఫ్లాపులతో సతమత మవుతున్న ఈ హీరోకి అంత బిల్డప్ అవసరమా అంటున్నారు ఆడియన్స్.సినిమా బాగుంటే ఆడియన్సే నాగ శౌర్యని మెచ్చుకుంటారు.
ఇప్పుడు డైరక్టర్ చెప్పడంతో అంచనాలు పెరుగుతాయి వాటికి ఏమాత్రం రీచ్ అవకపోయినా సరే సినిమా రిజల్ట్ వేరేగా ఉంటుంది.అందుకే ముందు అంచనాలను పెంచకుండా ఉండాలని ప్రేక్షకులు కోరుతున్నారు.