శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో రాబోతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ‘ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భారీ అంచనాలతో తెరకెక్కనున్న ఈ మూవీని మేకర్స్… అద్భుతమైన రీతిలో ప్రమోట్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ కాగా.దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
యూట్యూబ్ లో కూడా ట్రెండింగ్ లో నిలిచింది.ఇప్పటికే ఈ సినిమాలోని ‘సారంగ దరియా‘ అనే పాట విడుదలైన కొన్ని గంటల్లోనే… సోషల్ మీడియాలో ఓ సంచలనం సృష్టించింది.
ఈ సమయంలో సాయి పల్లవి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు అక్కినేని నాగ చైతన్య .మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన… సాయి పల్లవి తనకు కఠినమైన డ్యాన్స్ స్టెప్స్ ని నేర్పించిందని అన్నారు.అంతే కాకుండా వాటిని సులభమైన పద్ధతిలో ఎలా చేయాలో కూడా చిట్కాలు ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.దీంతో ఆయనకు కష్టమైన స్టెప్స్ కూడా చాలా సులభంగా చేశానని ఆయన అన్నారు.

అభిమానులకు ఒకవేళ తన పర్ఫార్మెన్స్ నచ్చితే మాత్రం… అది పూర్తిగా సాయి పల్లవికే చెందుతుందని ఆయన అన్నారు.సాయి పల్లవి తన నృత్యంతో అందర్నీ ఉల్లాసంగా ఉండేటట్టు చేస్తుందని.మరియు తన అందమైన స్టెప్పులతో అభిమానుల హృదయాలను కొల్లగొడు తుందని నాగ చైతన్య మెచ్చుకున్నారు.దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ … తెగ సంతోషంగా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది.