టాలీవుడ్ మోస్ట్ బ్యూటి ఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్య జంట గత సంవత్సరమే విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ ను వారు లీడ్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ జంట గురించి ఎప్పుడు సోషల్ మీడియా లో వార్తలు వస్తూనే ఉంటాయి.
ప్రెజెంట్ ఇద్దరు కూడా వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను బిజీగా మార్చు కున్నారు.

అయితే తాజాగా వీరిద్దరూ ట్విట్టర్ లో ఒకేరోజు ట్రెండింగ్ లోకి రావడం విశేషం.కానీ ఇద్దరు మ్యాటర్ వేరు.ఇద్దరు వేరు వేరు వార్తలతో నిన్నంతా హాట్ టాపిక్ అయ్యారు.
ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.నాగ చైతన్య తాజాగా మ్యాన్స్ వరల్డ్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద కూల్ లుక్ లో స్టైలిష్ అండ్ స్మార్ట్ గా దర్శనం ఇచ్చి ఆయన ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాడు.

దీంతో నిన్న అంతా కూడా ట్విట్టర్ లో ఈయన కొత్త లుక్ గురించి చర్చ జరగడంతో నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది.ఇక సమంత విషయానికి వస్తే ఈమె మివీ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటన వచ్చింది.దీంతో ఒక్కసారిగా ఈ విషయం చర్చకు రావడంతో ఆమె ఫ్యాన్స్ ‘సమంత ఫర్ మివీ’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేసారు.
ఇలా నాగ చైతన్య, సమంత ఒకే రోజు వేరు వేరు వార్తలతో ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచారు.
మరి వీరి సినిమాల విషయానికి వస్తే.సమంత చేసిన యశోద సినిమా రిలీజ్ కు రెడీగా ఉంటే.
ఖుషి సినిమా షూటింగ్ జరుపు కుంటుంది.అలాగే చైతూ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక బైలింగ్వన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.







