టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు.రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
ముందుగా పాదయాత్రను అక్టోబర్ లో ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ.ముందస్తు ఎన్నికలు లేవన్న అంచనాతో జనవరికి వాయిదా వేసినట్లు సమాచారం.
2023 జనవరి 26వ తేదీన ప్రారంభమై ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే సమయానికి పాదయాత్ర ముగిసే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.చిత్తూరు జిల్లాలో యాత్ర ప్రారంభమై ఉత్తరాంధ్రలో ముగిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
మొత్తం 450 రోజుల షెడ్యూల్ ను రూపొందిస్తున్నారు.ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుళ్లడంతో పాటు పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా లోకేశ్ పాదయాత్ర సాగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.







