టీజర్‌ టాక్ : బంగార్రాజు డబుల్‌ ధమాకా ఖాయం

నాగార్జున ప్రథాన పాత్రలో నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుని అప్పట్లోనే భారీ వసూళ్లు దక్కించుకుంది.

ఆ సినిమా లో బంగార్రాజు పాత్ర లో నాగార్జున కనిపించిన తీరు ఆకట్టుకుంది.ఆ సినిమా తర్వాత బంగార్రాజు పాత్రతో ఒక సినిమాను చేయాలని అభిమానులు నాగార్జునను కోరడం జరిగింది.

అందుకు నాగార్జున కూడా ఆసక్తి కనబర్చాడు.అలా బంగార్రాజు సినిమా పట్టాలెక్కింది.

నాగార్జున బంగార్రాజు సినిమా కోసం నాలుగు ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.నాగార్జున ఈ సినిమా లో బంగార్రాజు గా కనిపించబోతున్నాడు.

Advertisement

కేవలం నాగ్‌ మాత్రమే కాకుండా నాగ చైతన్య కూడా ఈ సినిమా లో బంగార్రాజు గా కనిపించబోతున్నట్లుగా తాజాగా విడుదల అయిన టీజర్ తో తేలిపోయింది.నాగార్జున తాత గా మరియు నాగ చైతన్య మనవడిగా కనిపించబోతున్నారు.

వీరిద్దరి కాంబో సన్నివేశాలు ఆకట్టుకుంటాయని అంటున్నారు.నాగార్జున మరియు నాగ చైతన్యలు ఇద్దరు కూడా బంగార్రాజు లుక్‌ లో కుమ్మేస్తారని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు.

మనం ఇంతకు ముందే నాగ చైతన్య కూడా బంగార్రాజు గా కనిపించబోతున్నట్లుగా చెప్పుకున్నాం.మేము చెప్పినట్లుగానే చైతూ కూడా బంగార్రాజుగానే కనిపించబోతున్నాడు.

అయితే చిన బంగార్రాజు అంటూ యూనిట్‌ సభ్యులు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.ఉప్పెన ముద్దుగుమ్మ కృతి శెట్టి ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతుంది.నాగార్జున ఈ సినిమాను నిర్మించాడు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతికి వస్తుందనే నమ్మకంతో అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. ఈ సినిమా లో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ కనిపించబోతుంది.

Advertisement

స్వర్గ లోక సన్నివేశాలు సినిమా కు ప్రధాన ఆకర్షణగా ఉంటుఆయని అంటున్నారు.సినిమా లో నాగ్ మరియు చైతూ లు ప్రేక్షకులకు డబుల్‌ ధమాకా ఇవ్వడం ఖాయం అని విశ్లేసకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు