డిజే టిల్లు డైరక్టర్ తో నాగ చైతన్య..!

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద సంచలన విజయం అందుకుందో తెలిసిందే.

ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే సిద్ధు అందించినా డైరక్షన్ మాత్రం విమల్ కృష్ణ అద్భుతంగా చేశాడు.

డీజే టిల్లు సినిమా హిట్ క్రెడిట్ హీరో సిద్ధుకే ఫుల్ ఇచ్చేసినా డైరక్టర్ గా విమల్ కృష్ణ కూడా తన టాలెంట్ చూపించాడని చెప్పొచ్చు.ఇక ఆ డైరక్టర్ తన నెక్స్ట్ సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు.

రీసెంట్ గా అక్కినేని హీరో నాగ చైతన్యకు డైరక్టర్ విమల్ కృష్ణ కథ వినిపించాడని తెలుస్తుంది.దాదాపు చైతుకి కథ నచ్చేసిందని టాక్.

అయితే థ్యాంక్ యు తర్వాత వరుసగా 3 సినిమాలు లైన్ లో పెట్టాడు నాగ చైతన్య.పరశురాం తో ఒకటి.

Advertisement

బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా లైన్ లో ఉన్నాయి.ఇప్పుడు విమల్ కృష్ణ సినిమాకు ఓకే చెబితే మాత్రం మరో రెండేళ్ల పాటు చైతు ఫుల్ బిజీ అని చెప్పొచ్చు.

డీజే టిల్లు హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్న విమల్ కృష్ణ చైతుతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు