'నా సామిరంగ' సెట్స్ లో బర్త్ డే వేడుకలు.. యంగ్ హీరోయిన్ తో టీమ్ సందడి!

అక్కినేని నాగార్జున ( Nagarjuna Akkineni ) మంచి పొంగల్ సీజన్ లో తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ మధ్య వరుస ప్లాప్స్ అందుకుంటున్న నాగ్ ఈసారి ఫ్యామిలీ మొత్తం చూసేలా మంచి ఎంటర్టైనర్ ను సంక్రాంతి సీజన్ లో తీసుకు రాబోతున్నాడు.

 Naa Saami Ranga Team Celebrates Mirnaa Menon Birthday, Mirnaa Menon Birthday, To-TeluguStop.com

ఈ సీజన్ లో ప్రేక్షకులు ఎలాంటి సినిమా కోరుకుంటారో అలా అన్ని ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.మరి నాగ్ వరుస ప్లాప్స్ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఆచి తూచి ఎంచుకున్న మూవీ ”నా సామిరంగ” ( Naa Saami Ranga).

అనౌన్స్ మెంట్ రోజునే టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగేలా చేసాడు.ప్రకటించగానే వెంటనే రెగ్యురల్ షూట్ కూడా స్టార్ట్ చేసి ఫినిష్ చేస్తూ సంక్రాంతి రేసులో నిలపనున్నారు.

ఇంత తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేయడం అనేది అందరికి షాకింగ్ విషయం అనే చెప్పాలి.ఇక తాజాగా ఈ సినిమా సెట్స్ లో యంగ్ హీరోయిన్ మిర్నా మీనన్ బర్త్ డే ( Mirnaa Menon birthday) వేడుకలు ఘనంగా చేసారు.దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పిక్స్ లో నాగార్జున తప్ప మిగిలిన టీమ్ అంత సందడి చేసారు.ఈ సినిమాలో అల్లరి నరేష్, మిర్నా మీనన్ (Mirnaa Menon ) కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.కాగా విజయ్ బన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ ( Ashika Ranganath ) హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube