లోగో మార్చిన మింత్రా.. ఎందుకంటే..?!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు ఆన్లైన్ షాపింగ్ కి అలవాటు పడ్డారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ, లైఫ్ స్టైల్ కు సంబంధించినవి కావాలి అంటే, ఇలా ఏదైనా కొనాలనుకుంటే ముందుగా ఆన్లైన్ లో ఈ కామర్స్ వెబ్ సైట్ లో సంప్రదించడం సర్వ సాధారణం అయిపోయింది.

దీనితో ఈ కామర్స్ సంస్థల మధ్య గట్టి పోటీ నెలకొంది.ఇదిలా ఉండగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్డ్ కు చెందిన మింత్రా లోగో మహిళలను కించపరిచేలా ఉందంటూ ముంబై నగరంలో కేసు నమోదు అయ్యింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.గత ఏడాది డిసెంబర్ నెలలో అవెస్త ఫౌండేషన్ కు చెందిన నాజ్ పటేల్ సైబర్ పోలీసులను సంప్రదించగా కేసు నమోదు చేశారు.

నాజ్ పటేల్ తన ఫిర్యాదులో మింత్రా లోగో మహిళలను కించపరిచేలా, అవమానపరిచే ఉందని దానిని మార్చేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.దర్యాప్తులో భాగంగా పోలీసులు కూడా మింత్రా లోగో అసభ్యకరంగా ఉన్నట్లు నిర్ధారణ చేసుకొని, మింత్రా సంస్థకు చెందిన  అధికారులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Advertisement

దీంతో వెంటనే స్పందించిన అధికారులు సంస్థ లోగోను మారుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందజేశారు.

దీంతో నెల వ్యవధి కాలంలోనే లోగోను పూర్తిగా చేంజ్ చేస్తామని హామీ ఇచ్చినట్లు ముంబై సైబర్ క్రైమ్ డిసిపి రష్మి కారండికర్ తెలియజేశారు. హామీ ఇచ్చిన ప్రకారమే మింత్రా వారి లోగోను సరికొత్తగా డిజైన్ చేసేందుకు కసరత్తు చేస్తోంది.అంతేకాకుండా ప్యాకింగ్ మెటీరియల్స్ పైన కూడా లోగోను మార్చినట్లు సమాచారం.

  ఇప్పటికే కొత్త లోగో తో ప్యాకింగ్ మెటీరియల్ ని కూడా ఆర్డర్ ఇచ్చినట్లు మింత్రా సంస్థ పోలీసులకు తెలియచేసింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు