అదిరిపోయిన 'బ్రో' ఫస్ట్ సింగిల్.. పవర్ స్టార్ స్వాగ్ తో ట్రీట్ నెక్స్ట్ లెవల్ !

మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మల్టీ స్టారర్ మూవీ ‘బ్రో( Bro movie )’.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

 My Dear Markandeya Lyrical Video Song Out From Bro Movie, Pawan Kalyan, Sai Dhar-TeluguStop.com

ఈ జులై లోనే రాబోతున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అందుకే ప్రమోషన్స్ కూడా వేగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Te ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్”.

పవన్ కళ్యాణ్ జస్ట్ గెస్ట్ రోల్ లో నటించినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ సైతం మంచి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా నుండి ఇటీవలే టీజర్ రిలీజ్ చేసిన విషయం విదితమే.

ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ను కొద్దీ నిముషాల క్రితం రిలీజ్ చేసారు.సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ లపై డిజైన్ చేసిన మాస్ సాంగ్ ను రిలీజ్ చేసారు.

మరి ఈ సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.సాయి తేజ్ అదిరిపోయే స్టయిల్ తో అదరగొట్టగా పవర్ స్టార్ తన స్వాగ్ అండ్ యాటిట్యూడ్ ను మైంటైన్ చేసారు.ఇది మెగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ లా అనిపిస్తుంది.బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా( Urvashi Rautela ) కూడా ఇందులో కనిపించి మెప్పించింది.

థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఇక సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.కాగా ప్రియా ప్రకాష్ వారియర్( Priya Prakash Varrier), కేతిక శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

https://youtu.be/yNnJ9de339k
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube