ఏ డైరెక్టర్ చేయని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ.ఫ్యామిలీ ని పక్కకు పెట్టేసి సింగిల్ లైఫ్ తో బాగా మింగిల్ అవుతున్నాడు.
ఒకప్పుడు మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వర్మ( Ram Gopal Varma ) ఇప్పుడు కాంట్రవర్సీ డైరెక్టర్ గా మారిపోయాడు.చేసే సినిమాలు, మాట్లాడే విధానం అన్ని బోల్డ్ గా ఉన్నాయని చెప్పాలి.
ఇప్పుడున్న సీనియర్ స్టార్ హీరోలంత ఈయనతో సినిమాలు చేసిన వాళ్ళే.వాళ్లంతా ఇప్పుడు స్టార్ పొజిషన్ లో ఉన్నారు.
కానీ వర్మ మాత్రం తన లైఫ్ స్టైల్ అది కాదని మొత్తం చేంజ్ చేశాడు.అసలు ఉన్నట్టుండి ఆయనలో చాలా మార్పు వచ్చేసింది.
పైగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఏదైనా టాపిక్ మీద రచ్చ లేపటమే కాకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిల ఫోటోలను పంచుకుంటూ ఉంటాడు.
వయసు మీద పడుతున్న కూడా వర్మపై అమ్మాయిలు తెగ వాలిపోతూ ఉంటారు.నిజంగా ఆయన లైఫ్ ను చూసి ఈ తరం కుర్రాళ్ళు బాగా కుళ్ళు కుంటారని చెప్పాలి.ఒక్కరోజైనా ఆర్జీవి లాగా బతకాలి అని తెగ ఆరాటపడుతూ ఉంటారు.
ఒక చేతిలో మందు మరో చేతిలో అమ్మాయిలని పట్టుకొని మామూలు రచ్చ చేయడు ఆర్జీవి.ఇక ఈయన తన సినిమాకు సంబంధించిన ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు.
అందులో ఎక్కువగా కుర్రకారులే కనిపిస్తుంటారు.ఇక వాళ్లు అడిగే బోల్డ్ ప్రశ్నలకు పచ్చి పచ్చిగా జవాబు ఇస్తుంటాడు.
ఎదుట కెమెరా ఉందని కూడా పట్టించుకోకుండా.మైండ్ లో ఏది అనిపిస్తుందో అదే బయటకు కక్కుతాడు.
ఏ విషయమైనా సరే మొహమాట పడకుండా చెప్పేస్తూ ఉంటాడు.ఇక తన ఎదుట అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తూ కనిపిస్తే మాత్రం ఆ అమ్మాయి తన మాటలతో సెలబ్రిటీ అవ్వాల్సిందే.
అసలు రాంగోపాల్ వర్మ చేసిన ఎంజాయ్ ఎంత ఉంటుందో తెలియదు కానీ ఆయన పంచుకునే ఫోటోలను చూస్తే మాత్రం కుర్రాళ్ళు ఆయనపై బాగా కుళ్ళు కుంటారు.నీ లైఫ్ బాగుంది మామ అని కొందరు కామెంట్లు పెడితే ముసలోడికి దసరా పండుగ అన్నట్లు మరికొందరు కామెంట్లు చేస్తూ ఉంటారు.
కానీ ఏదేమైనా ఆయన చుట్టూ మాత్రం అమ్మాయిలు బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు వాలుతూ ఉంటారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకున్నాడు.అందులో తను నగ్నంగా ఉన్న అమ్మాయిల ఫోటో దగ్గర తను నిలబడి ఫోటోలకు ఫోజ్ ఇచ్చాడు.అది తన ఫాంటసీ అన్నట్లు చూపించాడు.
ఇక ఆ ఫోటోలు చూసిన జనాలు కొందరు ఈయనపై బాగా ఫైర్ అవుతున్నారు.సోషల్ మీడియా( Social media) తెలిస్తే చాలు గబ్బు ఫోటోలతో దర్శనమిస్తున్నావు.అటువంటి ఫోటోలు దిగితే ప్రైవేట్ గా పెట్టుకోవాలి కానీ ఇలా పబ్లిక్ చేసి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నావు అంటూ బాగా ఫైర్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తున్నాయి.