అసంతృప్తిని కలిగించింది, అయినా తీర్పును గౌరవిస్తున్నాం

హిందూ ముస్లీం వివాదంగా మారిన అయోధ్య భూ వివాదం కేసును సుప్రీం నేటితో తేల్చి పారేసింది.

ఆ భూమిలో మసీదు ఏర్పాటు చేసినా కూడా అంతకు ముందు ఒక కట్టడం ఉన్నట్లుగా గుర్తించినట్లుగా సుప్రీం పేర్కొంది.

అందుకే సరైన పత్రాలు మరియు ఇతరత్ర కారణాల వల్ల హిందువులకు కొంత అనుకూలంగా తీర్పు వచ్చిందనే విషయం తెల్సిందే.అయితే ఈ తీర్పుపై ముస్లీం తరపు లాయర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

విచారణ సరిగానే జరిగినా తీర్పు విషయంలో కాస్త అసంతృప్తిగా ఉందని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు.ముస్లీంలకు అయోధ్యలోనే మరో చోట అయిదు ఎకరాల భూమిని కేటాయించేందుకు సుప్రీం ప్రభుత్వంను ఆదేశించింది.

అయినా కూడా ఆ రెండున్న రెకరాల స్థలం విషయంలో కాస్త గందరగోళం ఉన్న కారణంగా ముస్లీం తరపు లాయర్‌ ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశాడు.అయితే ఈ తీర్పును గౌరవిస్తున్నామని, ప్రతి ఒక్కరు కూడా సుప్రీం తీర్పుకు కట్టుబడి ఉండాలంటూ అందరు కూడా శాంతిగా ఉంటూ దేశ సార్వౌభౌమత్వంను కాపాడాలంటూ కోరడం జరిగింది.

Advertisement

ముస్లీం వక్ఫ్‌ బోర్డు సుదీర్ఘ కాలంగా ఈ కేసులో వాదనలు వినిపించడం జరిగింది.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు