2022.. కొత్త సంత్సరం అంతా తమన్ హవానే..

ఎస్ ఎస్ తమన్. ఈ ఏడాది పలు సినిమాలకు సంగీతం అందించి.

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.ఆయన సంగీతం అందించిన క్రాక్, వకీల్ సాబ్, అఖండ లాంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఈ సినిమా విజయంలో ఆయన అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలు అద్భుతంగా పనిచేశాయి.ప్రస్తుతం ఈ యువ సంగీత సంచలనం తమన్.

ఫుల్ బిజీగా మారిపోయాడు.దాదాపు అరడ డజన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Advertisement

ఈయన సంగీతం అందించిన పలు సినిమాలు వచ్చే ఏడాది వరుస బెట్టి విడుదల కాబోతున్నాయి.జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రతి నెలలోనూ ఆయన సంగీతం సమకూర్చిన సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

తాజాగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది.జనవరి 14న ఈ సినిమా విడుదల కాబోతుంది.

పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు సౌత్ వెర్షన్స్ కు తమన్ మ్యూజిక్ ఇచ్చాడు.ఫిబ్రవరిలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ విడుదల కాబోతుంది.

ఈ సినిమా ఫిబ్రవరి 25న జనాల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకు కూడా తమన్ సంగీతం అందించాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

మార్చి 18న వరుణ్ తేజ్ నటించిన గని సినిమా రాబోతుంది.

Advertisement

దీనికి కూడా తమన్ సంగీతం అందించాడు.అటు ఏప్రిల్ 1న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట విడుదల కాబోతుంది.ఈ సినిమాకు కూడా తమనే మ్యూజిక్ ఇచ్చాడు.

మొత్తంగా రాధే శ్యామ్ మొదలు కొని భీమ్లా నాయ‌క్, గ‌ని, స‌ర్కారు వారి పాట‌ సినిమాలు వరుసగా విడుదల అవుతున్నాయి.ఇప్పటికే మ్యూజిక్​ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న తమన్ ఈ సినిమాలతో మరింత పేరును తెచ్చుకునే అవకాశం ఉంది.

ఈయన సంగీతం అందించిన ఈ ప్రాజెక్టులు ఎలాంటి గుర్తింపు ఇస్తాయో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు