ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో మురళీధరన్ బయోపిక్ సెగ రేగిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.
ఈ సినిమాపై తమిళ సంఘాలు చేస్తున్న రచ్చ విజయ్ సేతుపతిని బెదిరించే వరకు వెళ్లిపోయాయి.ఇండస్ట్రీలో ఒక వర్గం ఈ బయోపిక్ ని వ్యతిరేకిస్తున్నారు.
మురళీధరన్ తమిళ ద్రోహి అని వాఖ్యానిస్తున్నారు.అయితే కొంత మంది మాత్రం ఈ బయోపిక్ కి మద్దతుగా మాట్లాడుతున్నారు.
ఇదిలా ఉంటే తన సొంత తమిళ ప్రజల నుంచి తన సినిమాపై ఈ స్థాయిలో వ్యతిరేకత రావడంపై మురళీధరన్ కాస్త ఆవేదనకి గురైనట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో అతను మీడియా ముందుకి వచ్చి బయోపిక్ పై జరుగుతున్న రాద్ధాంతంకి కొంత ఫుల్ స్టాప్ పెట్టె ప్రయత్నం చేశాడు.
తనని తమిళ ద్రోహిగా చిత్రీకరించడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా మురళీధరన్ మాట్లాడుతూ తాను శ్రీలంకలో ఒక తమిళ వ్యక్తిగా పుట్టడం నేను చేసిన నేరమా అని ప్రశ్నించారు.
తన పుట్టుక యుద్ధంతో మొదలైందని, తుపాకులు, బాంబుల చప్పుళ్ల మధ్య తన బాల్యం అనేక కష్టాల మధ్య నడిచిందని, అలాగే క్రికెట్ లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా తాను ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చాడు.తాను ఏనాడూ శ్రీలంకలో తమిళ ప్రజలకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, అప్పుడు తన మాటలని పూర్తిగా వక్రీకరించారని పేర్కొన్నారు.
తన బయోపిక్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాను బాల్యం నుంచి ఈ స్థాయి వరకు ఎదుర్కొన్న ఎన్నో అంశాలని చూపించబోతున్నారని, వాటిని ప్రపంచానికి తెలియజేయాలని ఈ బయోపిక్ కి ఒప్పుకున్నానని తెలిపాడు.ఒక వేళ నేను ఇండియాలో పుట్టి ఉంటే కచ్చితంగా టీం ఇండియాకి ఆడేవాడిని అని అన్నాడు.
తాను ఎప్పటికి తమిళుడునే అని చెప్పాడు.మరి మురళీధరన్ ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత అయిన తమిళ సంఘాలు అతని బయోపిక్ పై చేస్తున్న రచ్చకి ముగింపు పలుకుతాయేమో చూడాలి.