ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొలది సమ్మెలు ఎక్కువ అయిపోతున్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో అంగన్ వాడీ వర్కర్లు( Anganwadi Workers ) దాదాపు పది రోజులకు పైగా సమ్మె చేస్తూ ఉన్నారు.
విధులు బహిష్కరించి అంగన్ వాడీ కేంద్రాలకు తాళాలు వేశారు.జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు హామీ రాని పరిస్థితి నేపథ్యంలో డిసెంబర్ 31వ తారీకు తర్వాత ఉద్యమాన్ని ఉదృతం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.ఈలోపు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒకపక్క అంగన్ వాడీలు సమ్మె చేస్తూ ఉండగా మరొకపక్క మున్సిపల్ కార్మికులు( Municipal Workers ) రేపటి నుండి సమ్మె చేయడానికి రెడీ కావడం జరిగింది.కనీస వేతనం 26 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ తో సమ్మె చేయడానికి రెడీ కావడం జరిగింది.అంతేకాదు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని( Outsourcing Staff ) పర్మినెంట్ చేయాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, పెన్షన్ ఇవ్వాలని వారు కోరుతున్నారు.తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని మున్సిపల్ కార్మికులు మండిపడుతున్నారు.
దాదాపు రాష్ట్రంలో రెండు వారాల నుండి అంగన్ వాడీ ధర్నాలు చేయడం మరోపక్క మున్సిపల్ కార్మికులు రేపటి నుండి సమ్మెకు పిలవటం సంచలనంగా మారింది.