ఐపీఎల్ విజేతగా నాలుగోసారి టైటిల్ అందుకున్న ముంబై ఇండియన్స్

మొత్తానికి ఐపీఎల్ విజేత గా ముంబై ఇండియన్స్ నాలుగో సారి టైటిల్ గెలుచుకుంది.

చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠ తో సాగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నే విజయం వరించింది.

చివరి బాల్ వరకు మ్యాచ్ విజేతగా ఎవరు నిలుస్తారు అన్న విషయం సస్పెన్స్ గా సాగింది.చివరికి మలింగా మ్యాజిక్ తో చెన్నై ని ఒక్క రన్ తేడా తో ముంబై ఓడించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్ల లో 8 వికెట్లు నష్టపోయి 149 పరుగులు సాధించింది.అనంతరం బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆది నుంచి ధీటుగా ఆడినప్పటికీ చివరి నిమిషం లో మ్యాచ్ పొజీషన్ మారిపోయింది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒక్క వాట్సాన్ మాత్రం నిలకడగా ఆడి ఒంటరి పోరాటం చేయడం తో చెన్నై దాదాపు విజయాన్ని అందుకుంటుంది అని అందరూ భావించారు.కానీ 20 ఓవరు లు మలింగ తన అద్భుతమైన బౌలింగ్ తో అంచనాలను తారుమారు చేసాడు.

Advertisement

చివరి బాల్ రెండు రన్స్ సాధించాల్సిన టైం లో మలింగ బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ కు చేర్చడం తో ముంబై విజయాన్ని అందుకొని నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది.ముంబై జట్టులో పొలార్డ్, డికాక్ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించగా,.

చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ (3/26), తాహిర్ (2/23), శార్దూల్ (2/37) ఆకట్టుకున్నారు.ఈ మ్యాచ్ లో బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

భాగ్యనగరంలో జరిగిన ఈ మ్యాచ్కు 32,405 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

టి 20 వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యే బౌలర్లు వీళ్ళేనా..?

Advertisement

తాజా వార్తలు