ఒళ్ళు గగుర్పాటు కలిగించే ఘటన క్షణాల్లో జరిగిపోయింది

కొన్ని కొన్ని దృశ్యాలను చూస్తే ఒళ్లు గగుర్పాటు కు గురవుతుంది.అలాంటి దృశ్యాలను చూడడానికి కొందరు ధైర్యం కూడా చేయలేరు అలాంటి ఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి.

ఇటీవల టర్కీ లోని ఇస్తాంబుల్ లో చిన్నారి రెండో అంతస్తు నుంచి పొరపాటున జారి పడగా, కింద ఉన్న యువకుడు అనుకోకుండా అటుగా చూసి వెంటనే స్పందించి మరీ ఆ చిన్నారిని కాపాడిన సంగతి తెలిసిందే.ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

అయితే తాజాగా కొలంబియా లోని మెడిల్లిన్ కు చెందిన ఒక మహిళ తన బిడ్డతో కలిసి లిఫ్ట్ లో నాలుగో అంతస్తుకు చేరుకుంది.అనంతరం లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన ఆ మహిళకు ఇంతలో ఫోన్ రావడం తో తల్లి చేతిని విడిపించుకున్న ఆ చిన్నారి అటుగా ఉన్న రెయిలింగ్ వద్దకు వెళ్ళాడు.

అయితే రెయిలింగ్ ను పెట్టుకొనేందుకు ప్రయత్నించిన బాలుడు ఉన్నట్టుండి అదుపు తప్పి కిందపడిపోబోయాడు.అయితే వెంటనే దానిని గమనించిన తల్లి స్పందించి వెంటనే చిన్నారి కాలును పట్టుకొని పడకుండా ఆపగలిగింది.

Advertisement

దీనితో ఆ చిన్నారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడడం తో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు అన్నీ కూడా అక్కడి సీసీ టీవీ లో రికార్డ్ అవ్వడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యింది.దీనితో తల్లి ధైర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.ఆమెపై ప్రశంశల వర్షం కురిపిస్తూ,కేవలం తల్లికే ఇది సాధ్యం అవుతుంది అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

నిజంగా ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ వస్తుంది కానీ ఆ తల్లి మాత్రం ఏంతో ధైర్యం తో వ్యవహరించి తన కన్న బిడ్డను ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడుకోగలిగింది.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు