సౌత్ ను తెగ పొగిడేస్తున్న సీత.. మరి స్టార్ ను చేస్తే ఆ మాత్రం చేయాలిగా!

మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur )ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క సినిమాతో సౌత్ లో బాగా పాపులర్ అయ్యింది.

సీతారామం అనే హిట్ తో ఈ భామ సౌత్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ అయిపోయింది.

సీతారామం సినిమాలో( Sita Ramam ) సీత పాత్రలో నటించిన ఈ అమ్మడి నటనకు అంతా ఫిదా అయ్యారు.నార్త్ హీరోయిన్ అయినప్పటికీ ఈమె ఇక్కడ ఒక్క సినిమా తోనే అందరిని తన వైపుకు తిప్పుకుంది.

ఇక ఈ ఒక్క సినిమాతోనే ఈ అమ్మడికి పాన్ ఇండియా వ్యాప్తంగా బాగానే అవకాశాలు వరిస్తున్నాయి.ప్రజెంట్ టాలీవుడ్, ( Tollywood )బాలీవుడ్ ఇండస్ట్రీ లలోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పాగా వేయాలని చూస్తుంది.అయితే ఈమెకు తెలుగులో మాత్రం వరుస అవకాశాలు వరిస్తున్నాయి.

ఇక్కడ ప్రజెంట్ కుర్ర హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.

Advertisement

ఇదిలా ఉండగా ఈమె తన కెరీర్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.కెరీర్ స్టార్టింగ్ లో కేవలం మరాఠీ సినిమాల్లో ఆఫర్స్ వచ్చి అక్కడ సక్సెస్ అయితే చాలు అనుకున్న మృణాల్ పాన్ ఇండియా వ్యాప్తంగా అవకాశాలు వస్తుండడంతో చాలా హ్యాపీగా ఉందట.ఇందుకు కారణం తెలుగు సినిమానే అంటుంది.

సీతారామం సినిమా తన కెరీర్ ను పూర్తిగా మార్చేసింది అంటుంది.సౌత్ సినిమాల్లో ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుందని.

పేపర్ మీద ఎంత బలంగా రాసుకుంటారో అంతే బలంగా తెర మీద చూపిస్తారు.అందుకే సౌత్ లో వర్క్ చేసిన నటీనటులకు మంచి పేరు వస్తుంది అంటూ మన సౌత్ ఇండస్ట్రీని ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపించింది.

ఎంతైనా సీతారామం హిట్ఇండియన్ హీరోయిన్ ను చేస్తే ఈ మాత్రం పొగడాల్సిందే.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు