పులుల్ని కావాల‌నే తెచ్చి వ‌దులుతున్నారు: బీజేపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లోని గ్రామ‌స్తుల‌కు పులుల భ‌యం వెంటాడుతోంది.ఇది ముఖ్యంగా అట‌వీ ప్రాంత‌మున్న జిల్లా వాసుల‌కు మ‌రీ ఎక్కువ‌గా ప‌ట్టుకుంది.

వారి భ‌యానికి కార‌ణం లేక‌పోలేదు.గ‌తంలో పులులు మ‌నుషుల‌పై దాడులు చేసిన వార్త‌లు మ‌నం చూశాం.

అట‌వీ ప్రాంతాల్లో పులుల సంచారం ఎక్కువ‌గా ఉండ‌ట‌మే కాదు పులుల దాడుల్లో కొంత‌మంది ప్రాణాలు కూడా పొగొట్టుకున్న విష‌యం తెలిసిందే.కొన్ని చోట్ల‌ పొలం ప‌నుల‌కు వెళ్లే వారిని ల‌క్ష్యంగా చేసుకుని వారిపై పులులు దాడులు చేసిన ఘ‌ట‌న‌లు మ‌నం చూశాం.

దాడి చేసి పొద‌ల్లోకి లాక్కొని వెళ్లిన వీడియోల‌ను సైతం చూశాం.అలాగే ప‌శువుల‌పైన కూడా అక్క‌డ‌క్క‌డ పులులు దాడులు చేసిన వార్త‌లు,వీడియోలు ఈ మ‌ధ్య‌కాలంలో మ‌నం ఎక్కువ‌గా చూశాం.

Advertisement

దీంతో ఆ అట‌వీ ప్రాంత ప్ర‌జ‌లు ఒంట‌రిగా ఎక్క‌డిక‌న్న‌ వెళ్లాలంటెనే భ‌య‌బ్రాంతుల‌కు గుర‌వుతున్న ప‌రిస్థితి ఉంది.

అట‌వీ ప్రాంతాల్లోని గ్రామాల్లో పులుల సంచారం ఎక్కువ‌గా ఉంటుండ‌డంతో ఆయా ప్రాంత ప్ర‌జ‌లు, గిరిజ‌న‌లు బిక్కుబిక్కుమంటు కాలం గ‌డుపుతున్నారు.అయితే ఈ క్ర‌మంలోనే బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.అడ‌వుల నుంచి గిరిపుత్రుల‌ను వేరు చేసేందుకే ప్ర‌భుత్వ‌మే కావాల‌ని పులుల‌ను తీసుకొచ్చి అడ‌వుల్లో వ‌దులుతున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడిన సంద‌ర్బంలో ఈ కామెంట్స్ చేసిన‌ట్లు తెలిసింది.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఓ 15 వ‌ర‌కు పులుల‌ను వ‌దిలి ఉంటార‌ని ఆయ‌న ఆరోపించారు.

అయితే ప్ర‌భుత్వంపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు