దాడి ఘటనపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందన

హైదరాబాద్ లోని తని ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడిని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు.నివాసంపై దాడి చేసి మహిళలను భయపెట్టారన్నారు.

టీఆర్ఎస్ గూండాలు ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేశారని చెప్పారు.తన తల్లిపై కూడా దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

నిజామాబాద్ లో కవిత పోటీ చేస్తారా అని ప్రశ్నించారు.ఆమె పోటీ చేస్తానంటే స్వాగతిస్తానని చెప్పారు.

కవిత ఇంతలా రియాక్ట్ అవుతున్నారంటే తాను చెప్పినదాంట్లో నిజం ఉన్నట్లుందని వ్యాఖ్యనించారు.విమర్శలు చేస్తే దాడి చేస్తారా అని అడిగారు.

Advertisement

బీజేపీ నేతలు కవితకు ఫోన్ చేశారని గతంలో కేసీఆరే అన్నారు.అలా అయితే కేసీఆర్ ఇంటిపై కూడా దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.

దూరం పెట్టారంటూ ప్రముఖ కోలీవుడ్ నటి ఖుష్బూ ఆవేదన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు