లైట్స్‌ తీసేస్తే కరోనా పోతుందా మోడీ అంటున్న ఓవైసీ

ప్రధాని నరేంద్ర మోడీపై హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించాడు.నేడు ప్రధాని వీడియో సందేశం ఇచ్చిన విషయం తెల్సిందే.

ఆ వీడియో సందేశంలో మోడీ ఈనెల 5వ తారీకున రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు బంద్‌ చేసి మన మనో ధైర్యంను చాటుకోవాలంటూ మోడీ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. మోడీ వీడియో సందేశంపై ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

లైట్లు బంద్‌ చేస్తే కరోనా ఏమైనా పారిపోతుందా అంటూ ప్రశ్నించాడు.కరోనా నేపథ్యంలో కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

వలస కార్మికులు ఏ స్థాయిలో రోడ్ల మీద నడుచుకుంటూ వారి వారి ప్రాంతాలకు వెళ్తున్నారో మనం చూశాం.ఈ దేశం ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలా ఉంది.

Advertisement

దేశంలో ఉన్న వారు మనుషులే.వారికి ఆశయాలు ఉన్నాయి.

ఈ 9 గంటల 9 నిమిషాల జిమ్మికులు ఏంటో అర్థం కావడం లేదని అన్నాడు.ఈ ట్యూబ్‌ లైట్‌ ఐడియాలు నేను ఎక్కడ వినలేదు.

మోడీ రాష్ట్రాలకు ఏమైనా శుభవార్త చెబుతాడనుకుంటే ఇలాంటి ట్యూబ్‌లైట్‌ పిలుపునివ్వడం విడ్డూరం అంటూ ఒవైసీ అసహనం వ్యక్తం చేశాడు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు