కేసీఆర్ ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పరామర్శించారు.

ఈ మేరకు యశోద ఆస్పత్రికి వెళ్లిన ఆయన కేసీఆర్ ను పరామర్శించారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ప్రకాశ్ రాజ్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.అలాగే కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రకాశ్ రాజ్ తో పాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ ను పరామర్శించారు.అయితే కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి సర్జరీ జగరడంతో ప్రస్తుతం ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా ఇటీవల ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ప్రమాదవశాత్తు జారి పడిన సంగతి తెలిసిందే.

Advertisement
ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి

తాజా వార్తలు