వైరల్: బిడ్డను గట్టిగా హత్తుకుంటూ ముద్దులు పెడుతున్న కంగారు... అనిర్వచనీయ ప్రేమ అంటే ఇదే!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని కొన్ని వీడియోలను గాని ఫోటోలను గాని చూసినపుడు ఒక్కోసారి చాలా ఎమెషనల్ గా అనిపిస్తుంది.

అలా చాలా అరుదుగా జరుగుతుంది.

తాజాగా అలాంటి తరహా వీడియో ఒకటి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.అమ్మ ప్రేమకు సరియైన నిర్వచనం ఇచ్చేలా వుంది ఆ వీడియో.

అవును, అమ్మ ప్రేమను గురించి చెప్పడానికి పదాలు సరిపోవు.కానీ ఈ వీడియో ఒక్కటి సరిపోతుంది.

సృష్టిలో తల్లికి మించిన యోధులెవరూ లేరు అని ఓ రైటర్ తన సినిమాలోని చెప్పాడు.సరిగ్గా ఆ పదాలను నిజచేస్తోంది ఈ వీడియో.

Advertisement

సదరు వీడియోని చూస్తే, ఒక తల్లి కంగారు తన బిడ్డను ప్రేమగా కౌగిలించుకోవడం ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయబడింది.

కాగా దీనిని తాజాగా IFS అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్‌లో షేర్ చేయగా వెలుగు చూసింది.షెల్లీ పియర్సన్ అనే ఫోటోగ్రాఫర్ ఈ వీడియోను తన కెమెరాలో రికార్డ్ చేసాడని సమాచారం.

ఇప్పటివరకు ఈ వీడియో 150 వేలకు పైగా వ్యూస్ రాబట్టి రికార్డులు సృష్టిస్తోంది.ఇంకా కౌంట్ కొనసాగుతోంది.క్లిప్‌ను చూసిన ట్విట్టర్ వినియోగదారులు చాలా ఎమోషనల్ అవుతున్నారు.

అంతేకాకుండా తమకి ఇష్టమైనవారితో ఈ వీడియోను పంచుకోవడం కనిపిస్తుంది.రకరకాల కామెంట్స్ చేయడం ఇక్కడ చూడవచ్చు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)

తల్లి ప్రేమ గొప్పదని ఈ వీడియో నిరూపించింది అని ఒకరంటే, అమ్మ ప్రేమను మించినది ప్రపంచంలో మరొకటి లేదని ఒకరు కామెంట్ చేసారు.ఇంకో యూజర్ కామెంట్ చేస్తూ.

Advertisement

అమ్మ ప్రేమకు దూరమైన నాకు తెలుసు అమ్మ విలువేమిటో? అని చాలా ఎమోషనల్ గా రాసుకొచ్చాడు.

తాజా వార్తలు