బాలీవుడ్‌లో తిరుగులేని రారాజు అయిన షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) తన అప్‌కమింగ్ ఫిల్మ్ డుంకీ తో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నాడు.ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డిసెంబరు 22న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి.ఆ రోజు థియేటర్లు ప్రేక్షకులతో పోటెత్తే అవకాశం ఉంది.

విదేశాల్లో నివసిస్తున్న షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అసోసియేషన్స్ కూడా ఈ మూవీ చూసేందుకే భారతదేశానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు.ప్రత్యేకంగా పెద్ద తెరపై డుంకీ మాయాజాలాన్ని చూసేందుకు వారు మూవీ మూవీలు ఉవ్విలూరుతున్నారు “గాడిద” మార్గంగా పిలిచే చట్టవిరుద్ధమైన ఇమ్మిగ్రేషన్ చుట్టూ ఈ సినిమా తిరగనుంది.అయితే అభిమానులు మాత్రం ఆ ఇల్లీగల్ రూట్ లో కాకుండా లీగల్ పాత్‌లో తమ ప్రియమైన స్టార్ లేటెస్ట్ మూవీని చూసేందుకు తరలి వస్తున్నారు.నేపాల్, కెనడా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లలో నివసిస్తున్న 500 మంది ఎన్నారైలు ఈ సినిమా చూసేందుకు స్వదేశానికి రానున్నారని సమాచారం.
ఇవి అధికారిక లెక్కలు మాత్రమే ఇంతకు మించి కూడా ఫాన్స్ ఇండియాకి వచ్చే అవకాశం ఉంది.

సినిమా చూసేందుకు దేశాలు దాటి వస్తున్నారంటే షారుఖ్ కు ఉన్న క్రేజ్ ఏపాటితో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.డుంకీ మూవీ డ్రాప్ 1 టీజర్, తరువాత చార్ట్-టాపింగ్ సాంగ్ “లుట్ పుట్ గయా” సినిమాపై అంచనాలు మరింత పెంచేశారు.తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ షారూఖ్ ఖాన్‌తో కలిసి కీలక పాత్రల్లో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.







