నిరుపయోగంలో బస్ షెల్టర్లు - మూడపల్లి బస్ షెల్టర్కు అడ్డుగా చెట్ల పొదలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన బస్ షెల్టర్లు నిరుపయో గంలో ఉన్నాయి.

బస్సు వచ్చే వరకు వెళ్లే ప్రయాణికు లు రోడ్డుపైనే వేచి ఉంచే పరిస్థితి నెలకొంది.

వేములవాడ మండలం కోనాయిపల్లి, మర్రిపల్లి, చందుర్తి మండలం మూడపల్లి, మర్రి గడ్డ, మల్యాల, గూండ్లపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లోని బస్ షెల్టర్ లు నిరుపయో గంలోనే ఉన్నాయి.బస్ షెల్టర్ లో కూర్చుకునే సెల్ఫ్ బండలు కూలిపోయాయి.

బస్సు కోసం ప్రయాణికులు రోడ్డుపైనే కూర్చుంటున్నారు.చందుర్తి మండలం మూడపల్లి బస్టాండ్ కు ఎదురుగా చెట్ల పొదలు ఉంటు న్నాయి.

దానిలోకి వెళ్లేందుకు ప్రయాణికులు భయంతో రోడ్డుపైనే బస్ కోసం వేచి చూస్తున్నారు.గ్రామపంచాయతీ నిధులతో ఏడాదికోసారి రంగులు వేస్తున్నప్పటికీ సౌకర్యాలు కల్పించలేక ఉపయోగం లోకి చేయలేకపో యారు.

Advertisement

ఇప్పటికైనా అధికారులు బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులకు అన్ని సౌకర్యాలతో బస్టాండ్లను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నా రు.వేములవాడ నుండి కరీంనగర్ వెళ్లే రహదారిలోని వేములవాడ మండలం నాంపల్లి బస్ షెల్టర్ నిరుప గంలోనే ఉంది.

కలెక్టరేట్ సముదాయంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి
Advertisement

Latest Rajanna Sircilla News