Mokshada Ekadashi: మోక్షదా ఏకాదశి రోజు ఇలా పూజలు చేస్తే అన్ని సమస్యలు దూరమవుతాయా.. ఆ ఏకాదశి ఎప్పుడంటే..

మన దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కార్తీక మాసాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ప్రస్తుతం కార్తీక మాసం చివరి దశలో ఉంది.

హిందు క్యాలెండర్ ప్రకారం ఏకాదశిని 11వ తేదీ అని అంటారు.ఈ ఏకాదశి నెలలో రెండుసార్లు వస్తుంది.

అంటే మొత్తం 12 నెలలకు గాను 24 సార్లు ఈ ఏకాదశిని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటారు.వీటిలో మోక్షదా ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

మోక్షదా ఏకాదశిని మార్గశిర మాసంలో జరుపుకుంటారు.ఈ మోక్షదా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఎంతో భక్తితో వ్రతాన్ని ఆచరిస్తూ సర్వపాపాల నుంచి విముక్తి కలగాలని పూజలు చేస్తూ ఉంటారు.

Advertisement
Mokshada Ekadashi Pooja Process Sri Mahavishnu Details, Mokshada Ekadashi , Moks

కాబట్టి ఆ రోజు మోక్షగా ఏకాదశి ఎప్పుడో తెలుసుకుందాం.మోక్షదా ఏకాదశి డిసెంబర్ 3 2022 శనివారం రోజు జరుపుకోవాలని 2022 డిసెంబర్ మూడవ తేదీన ఉదయం 5:39 నిమిషములకు ఈ మోక్షదా ఏకాదశి మొదలై, మరుసటి రోజు డిసెంబర్ 4వ తేదీ 2022 ఆదివారం ఉదయం 5:34 ముగిసిపోతుంది.ఆ ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి పసుపు వస్త్రాలను ధరించి ఆ తర్వాత ఆ విష్ణుమూర్తిని పసుపు పుష్పాలతో పూజించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం ఆ ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే శ్రీమహావిష్ణువుకు పాలు, పెరుగు, తేనె, గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఏ పనులు చేసినా ఆ పనులలో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.

Mokshada Ekadashi Pooja Process Sri Mahavishnu Details, Mokshada Ekadashi , Moks

ఆ ఏకాదశి రోజున రావి చెట్టుకు పచ్చిపాలు, గంగా జలాన్ని సమర్పించడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలు దరి చేరవు మోక్షదా ఏకాదశి రోజున పేదవారికి దానం చేయడం వల్ల అత్యంత పుణ్యఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా పసుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల ఎంతో మంచిదని కూడా చెబుతున్నారు.ఎందుకంటే పసుపు రంగు విష్ణుకు ఎంతో ఇష్టమైనది కాబట్టి.

ఆ రోజున శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించడం వల్ల ఇంట్లో సిరిసంపదలు వస్తాయి.

సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు