మలయాళీ రీమేక్ కోసం రెడీ అవుతున్న మోహన్ బాబు

టాలీవుడ్ నిర్మాతలు దర్శకులు అందరూ ఇప్పుడు మలయాళీ సినిమాలపై మనసు పడుతున్నారు.

అక్కడ తెరకెక్కి సూపర్ హిట్ అయిన సినిమాలని తెలుగులో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

మన హీరోలుకూడా మలయాళీ చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.అక్కడ మంచి కంటెంట్ ఉన్న కథలు తెరకెక్కుతూ ఉండటంతో వాటిని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు.

అలాంటి కథలతో అయితే మళ్ళీ హిట్ కొట్టడం గ్యారెంటీ అని భావించి వాటికోసం ఆసక్తి చూపిస్తున్నారు.అయితే బాలీవుడ్ దర్శకులు తెలుగు కథల మీద ఆసక్తి చూపిస్తూ ఉండటం ఇక్కడ విశేషం.

ఇప్పుడు మలయాళీ చిత్రాలని తెలుగులోకి తీసుకొస్తున్న నటుల జాబితాలో మోహన్ బాబు కూడా చేరిపోయాడు.ఓ మలయాళీ సూపర్ హిట్ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి మోహన్ బాబు ఆసక్తి చూపిస్తున్నాడు.

Advertisement

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్న ఇదివరకు ఉన్నంత స్పీడ్ ఇప్పుడు మోహన్ బాబులో లేదు.చిరంజీవి, మోహన్ బాబు ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

ఇంచుమించు ఒకే వయసు వారు.అయితే చిరంజీవి హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

మోహన్ బాబు మాత్రం వయస్సు పైబడిన వాడిలా మారిపోయాడు.అయితే తన ఆహార్యానికి సరిపోయే కథలతో ఇకపై రెగ్యులర్ గా సినిమాలు చేయాలని మోహన్ బాబు అనుకుంటున్నట్లు తెలుస్తుంది.అందులో భాగంగానే గతేడాది నవంబర్లో మలయాళంలో రిలీజ్ అయినా ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25 అనే సినిమా రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.సూరజ్ వెంజరామూద్, సౌబిన్ సాహిర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సైన్టిఫిక్ కామెడీ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది.

అంతేకాదు, మూడు రాష్ట్ర స్థాయి అవార్డులను కూడా సొంతం చేసుకుంది.నూతన దర్శకుడు రతీశ్ బాలకృష్ణన్ రూపొందించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు