మొట్ట మొదటి ప్రధాని

మనకు చాలామంది బంధువుల ఉంటారు.కాని కొంతమంది ఇళ్లకే తరచుగా వెళుతుంటాం.

కొందరికి ఇళ్లకు అసలు జీవితంలో ఎప్పుడూ వెళ్లం.

ఎప్పుడో ఒక సందర్భంలో వెళితే వెళతాం.

ప్రధానులు, రాష్ర్టపతులు కూడా అంతే.కొన్ని ముఖ్యమైన దేశాలకు అసలు వెళ్లనే వెళ్లరు.

ఆ దేశాలతో మనకు దౌత్యసండంధాలుంటాయి.వ్యాపార సంబంధాలుంటాయి.

Advertisement

అనేక రకాల ఒప్పందాలుంటాయి.కాని ఎందుకో ప్రధానులకు వెళ్లడం కుదరదు.

ఇజ్రాయిల్‌ ఓ ముఖ్యమైన దేశం.వ్యవసాయ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది.

ఎడారిలో పంటలు పండిస్తారు.వారి వ్యవసాయం చూసి మనం ఆశ్చర్యపోతాం.

అలాంటి వ్యవసాయం మనమూ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నాం.ఎంతో అభివృద్ధి సాదించిన ఇంత గొప్ప దేశాన్ని ఇప్పటివరకు ఏ భారత ప్రధానీ సందర్శిచలేదు.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఎంవీవీ బీజేపీ వైపు చూస్తున్నారా ? అందుకే పోటీ నుంచి తప్పుకున్నారా ? 

మంత్రులు వెళ్లారనుకోండి.అది వేరే విషయం.

Advertisement

ప్రధాని పర్యటనకే ప్రాధాన్యం ఉంటుంది.ఇజ్రాయిల్‌కు వెళుతున్న మొట్టమొదటి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డులకెక్కారు.

ఆయన త్వరలో ఆ దేశానికి వెళుతున్నారు.అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో పద్దెనిమది విదేశీ పర్యటనలు చేసిన మోదీ రెండో ఏడాదిలోనూ అదే ఊపు కొనసాగిస్తారేమో.

తాజా వార్తలు