విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం విమానాశ్రయాలు ఇక అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారబోతున్నాయి.వీటిని ఈ మేరకు అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీకి వాణిజ్యపరంగా, ఇతరత్రా విజయవాడ గుండెకాయ వంటిది.అందులోనూ ఇప్పుడు కొత్త రాజధాని నగరం అమరావతి దీని సమీపంలో ఉంది.
దీంతో ఈ నగరానికి చాలా ప్రాధాన్యం పెరుగుతుంది.ఇక తిరుపతి సంగతి చెప్పేదేముంది.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.ప్రపంచ ప్రఖ్యాత ఆలయం ఉన్న ప్రాంతం.
కాబట్టి ఇక్కడ రద్దీ ఎక్కువ.దేశ, విదేశాల నుంచి రోజూ ఎందరో వస్తుంటారు.
విశాఖను ఏపీకి ఆర్థిక రాజధాని అంటున్నారు.ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన విశాఖకు అంతర్జాతీయ విమానాశ్రయం చాలా అవసరం.
కాబట్టి ఈ మూడు నగరాల్లోని విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి పెంచడం సమంజసమే.ఏపీకి వరం సుదీర్ఘమైన సముద్రతీరం.
ఎన్నో ఓడరేవులు ఉన్నాయి.వాటిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్థికాభివృద్ధిలో జల రవాణా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి వీటిని అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం పెరుగుతుంది.







