మోదీ పాకిస్థాన్ రాయబారా ?

బీజేపీ పేరు చెప్పినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు చెప్పినా ఒంటి కాలిమీద లేస్తూ మరీ తన ఆగ్రహాన్ని చూపిస్తూ ఉండే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ అగ్ర నాయకులను ఉతికి ఆరేస్తుంటారు.

తాజాగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

మోదీ భారత ప్రధానిలా కాకుండా పాకిస్థాన్ రాయబారుల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.ఆయన భారతదేశంలో ఉన్న సమస్యలు, పరిస్థితుల గురించి మాట్లాడ్డం మానేసి రోజంతా పాకిస్థాన్ గురించే మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేసారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర బెంగాల్‌లో శుక్రవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు ఎవరైనా నిరుద్యోగులు తమకు ఉద్యోగం కావాలని అడిగితే ప్రధాని మోదీ వారిని పాక్‌కు వెళ్లమంటున్నారు.ఎవరైనా పరిశ్రమలు రావడం లేదని అంటే వారిని కూడా ఆయన పాక్‌ వెళ్లమంటున్నారు అంటూ ఆమె ప్రశ్నించారు.

తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అమల్లోకి వచ్చిన కోడ్!
Advertisement

తాజా వార్తలు