మొబైల్ రేడియేషన్ సమస్యకు ఆవు పేడతో చెక్..?!

ఒకప్పుడు చిన్న ఫోన్లు మాత్రమే ఉండేవి.వాటిల్లో ఇంటర్నెట్ ఫెలిసిటీ కూడా ఉండేది కాదు.

ఓన్లీ ఫోన్లు మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడేవి.స్మార్ట్ ఫోన్లు( Smart Phones ) కొనుగోలు చేయాలంటే అధిక ధర ఉండేవి.

కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల కాలం నడుస్తోంది.అత్యాధునిక ఫీచర్లతో రోజుకో ఫోన్ మార్కెట్ లోకి వస్తుంది.

స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏ పనులు జరగలేనంతగా వాటి వినియోగం పెరిగిపోయింది.అయితే స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి.

Advertisement

ఫోన్ సిగ్నల్స్ రేడియేషన్( Radiation ) వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి.

రేడియేషన్ నుంచి చిన్నపిల్లలను కాపాడుకునేందుకు చాలామంది చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వరు.అయితే పిల్లలను రేడియేషన్ నుంచి కాపడటానికి ఒక వ్యక్తి వినూత్న ఆవిష్కరణ కనిపెట్టాడు.ఆవుపేడతో( Cow Dung ) రేడియేషన్ సమస్యకు చెక్ పెట్టడానికి మంచి ఉపాయం కనిపెట్టాడు.

ఆవు పేడతో మొబైల్ కవర్లను తయారుచేశాడు.ఈ కవర్లను వాడితే రేడియేషన్ సమస్య ఉండదని చెబుతున్నారు.

ప్రముఖ శాస్త్రవేత్త అయిన శివదర్శన్ మాలిక్( Sivadarshan Malik ) గోవులకు సంబంధించి విషయాలపై పరిశోధనలు చేస్తూ ఉంటారు.ఆయన ఆవు పేడతో ఈ మొబైల్ కవర్లను తయారుచేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

రేడియెషన్ ను నియంత్రించే శక్తి ఆవు పేడకు ఉంటుందని శివదర్శన్ మాలిక్ చెబుతున్నారు.ఆవు పేడతో తాయరుచేసిన ఈ మొబైల్ కవర్లు వాడితే మనం మొబైల్ వాడేటప్పుడు రేడియేషన్ మన చేతుల గుండా శరీరంలోకి వెళ్లదని అంటున్నారు.గతలో మాలిక్ ఆవు పేడ, మట్టి, ఇతర సేంద్రీయ ఎరువులను ఉపయోగించి కాంక్రీట్ ఇటుకలను తయారుచేశారు.

Advertisement

ఆ ఇటుకలను ఇంటి నిర్మాణంలో ఉపయోగిస్తే రేడియేషన్ ఇంట్లోకి రాదట.అలాగే ఇంట్లోకి వేడి కూడా రాదని, ఎప్పుడూ చల్లగా ఉంటుందని చెబుతున్నారు.అలాేగే దీని వల్ల పర్యావరణాన్ని కూడా కాపడవచ్చని అంటున్నారు.

ఇలా ఆవు పేడతో ఆయన అనేక వస్తువులు తయారుచేస్తూ పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ పిలుపు ఇస్తున్నారు.

" autoplay>

తాజా వార్తలు