నిజాంబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో జిల్లా ప్రజలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవితతో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రజలకు దూరమయ్యే పార్టీ తెరాస కాదని అధికారంలో ఉన్నా లేకున్నా తెరాస ప్రజలతోనే ఉంటుందని తెలిపారు కొందరు ప్రజలను విడగొట్టి ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ సమాజాన్ని మతం పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం 22 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అవి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షలు ఉద్యోగాలను భర్తీ చేస్తుందని కవిత అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మరియు బిజెపి పాలిత రాష్ట్రాల్లో పథకాల అమలును గమనించి ఆలోచించాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు
.