ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు( Delhi Rouse Avenue Court )లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు.ఈ మేరకు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam )లో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
అయితే తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయన్న నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్( Interim Bail Petition ) మంజూరు చేయాలని కోరుతూ కవిత( BRS MLC Kavitha ) రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు విన్న ధర్మాసనం తాజాగా మధ్యంతర బెయిల్ ను ఇచ్చేందుకు నిరాకరించింది.
మరోవైపు ఈ కేసులో కవిత జ్యూడీషియల్ కస్టడీ( Judicial Custody ) రేపటితో ముగియనుంది.