పరిటాల కుటుంబానికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి సవాల్

ప‌రిటాల కుటుంబానికి వైసీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి స‌వాల్ విసిరారు.

కాంట్రాక్ట‌ర్ ను డ‌బ్బులు అడిగానంటూ త‌న‌పై ప‌రిటాల సునీత‌, ప‌రిటాల శ్రీరామ్ అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని మండిపడ్డారు.

దీనిపై కాణిపాకంలో ప్ర‌మాణం చేస్తాన‌న్న తోపుదుర్తి.అబ‌ద్ధాలు చెబుతున్న ప‌రిటాల కుటుంబం కూడా ప్ర‌మాణం చేస్తారా అని ప్ర‌శ్నించారు.

అదేవిధంగా త‌న‌పై ఆరోప‌ణ‌ల‌కు సీబీఐతో కూడా విచారణ జరుపుకోవచ్చని తెలిపారు.పరిటాల శ్రీరామ్ దౌర్జన్యాలు చేస్తానంటే కుదరదన్నారు.

క్రిమినల్స్ కు షెల్టర్ ఇచ్చే సంస్కృతి పరిటాల కుటుంబానిదని విమ‌ర్శించారు.పోలీసులు నిజాయతీగా పని చేయడం వారికి నచ్చదని తోపుదుర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement
వాలంటీర్ల విషయంలో సస్పెన్స్ .. వాటిని తొలగించాలంటూ ఆదేశాలు 

తాజా వార్తలు