ఆమె ఒక్క ఎమ్మెల్యేకానీ అంతకంటే ముందు ఒక్క మాతృమూర్తి.ఇటు తల్లిగా, అటు ప్రజానిధిగా రెండు బాధ్యతలను నిర్వహించి ప్రజల ప్రశంసను అందుకున్నారు.
తాజాగా తన రెండు నెలల ససికందుతో కలిసి అసెంబ్లీ సమావేశానికి హాజరై అందర్ని ఆశ్చర్యపరిచారు. మహారాష్ట్రలోని డియోలాలి నియోజకవర్గానికి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సరోజ్ అహిరే ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చారు.
శీతాకాలపు సెషన్‌లో మొదటి రోజున అహిరే తన బిడ్డతో అసెంబ్లీ అవరణంలో కనిపించారు. అహిరే తన బిడ్డను ఎత్తుకుని అసెంబ్లీ కారిడార్‌ల తిరుగుతూ కనిపించారు.ఈ దృశ్యాన్ని పలువురు ఎమ్మెల్యేలు ఆసక్తిగా తిలకించారు. సరోజ చేతుల్లో ప్రశాంతంగా నిద్రపోతున్న పిల్లన్ని చూసి మైమరిచిపోయారు.
వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఆమె సహచరులు, తోటి శాసనసభ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు బిడ్డ, తల్లితో సెల్ఫీలు కూడా దిగారు.
ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సరోజ్ అహిరే.నిబ్డత గల ఎమ్మెల్యేగా శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు డుమ్మ కొట్టకుండా సభకు హజరయ్యారు.

కరోనా కారణంగా రెండేళ్లకు పైగా నాగ్‌పూర్‌లో సమావేశాలు నిర్వహించలేదు.ఇక తాజా నిర్వహిస్తున్న సమావేశాలకు ఆమె హాజరు కావాలనుకున్నారు“నేను తల్లిని, ప్రజాప్రతినిధిని. కరోనా మహమ్మారి కారణంగా గత రెండున్నరేళ్లుగా, నాగ్‌పూర్ వేదికగా జరగలేదు.నేను ఇప్పుడు తల్లిని అలాగే నా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేను కూడా.వారి ఇచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలనుకున్నాను.”అని అహిరే మీడియా ప్రతినిధులకు తెలిపారు.
ఎమ్మెల్యే అంకితభావాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మెచ్చుకున్నారు, ప్రసవానంతర దశలో ఒక ఎమ్మెల్యే మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశానికి హాజరు కావడం, ఆమె తల్లి బాధ్యతలను నిర్వర్తించడం ప్రశంసినీయం. ఏక్‌నాథ్ షిండే అహిరే, ఆమె కుటుంబ సభ్యులను తన ఛాంబర్‌కి ఆహ్వానించారు తల్లి అయినప్పటికీ సెషన్‌కు హాజరైనందుకు ఆమెను ప్రశంసించారు.