నారా లోకేశ్ కు ఎమ్మెల్యే పెద్దారెడ్డి సవాల్.. !

టీడీపీ నేత నారా లోకేశ్ కు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంటర్ ఇచ్చారు.

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై 70 కేసులు, ఒక్కొక్క టీడీపీ కౌన్సిలర్ పై 24 కేసులు ఉన్నాయని లోకేశ్ అంటున్నారని తెలిపారు.

ఈ క్రమంలో టీడీపీ నేతలపై కేసులను లోకేశ్ నిరూపించాలని పెద్దారెడ్డి డిమాండ్ చేశారు.లోకేశ్ కేసులు నిరూపిస్తే తాను తప్పు చేశానని ఒప్పుకుంటానని సవాల్ విసిరారు.

లోకేశ్ చెప్పినట్లు జేసీపై 70 కేసులు ఉన్నాయని నిరూపిస్తే తాను జిల్లా నుంచి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు.ఒకవేళ నిరూపించకుంటే జేసీ తన స్వస్థలం గద్వాలకు వెళ్తారా అని ప్రశ్నించారు.

తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!
Advertisement

తాజా వార్తలు