మీరు చదువుతుంది కరక్టే.ఎమ్మెల్యే గారు తనకు మంత్రి పదవి కావాలని గోవా సీ ఎం ప్రమోద్ సావంత్ ను కోరారట.
నాకు పెద్ద పెద్ద మంత్రి పదవులు అవసరం లేదు కనీసం చెత్త కైనా నన్ను మంత్రిగా నియమించాలి అంటూ వేడుకుంటున్నారట.విషయం కేబినెట్ పదవి ఆశించిన గోవా డిప్యూటీ స్పీకర్,బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో కు గోవా ప్రభుత్వం మొండిచేయి చూపించింది.
ఆయనకు కనీసం ఎలాంటి మంత్రిత్వ శాఖ ఇవ్వకపోవడం తో అసహనం వ్యక్తం చేసిన ఆయన చివరికి నన్ను చెత్తకైనా మంత్రిగా నియమించాలి అంటూ ప్రమోద్ సావంత్ ని కోరినట్లు తెలుస్తుంది.చెత్త అంటే కంపు కాబట్టి ఎవరూ ఆ శాఖను కోరుకోరు కావున ఆ భాద్యతలు నిర్వర్తించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ మైఖైల్ పేర్కొన్నారు.
గత 25సంవత్సరాలుగా చెత్త సమస్యకు పరిష్కారం కోసం ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రపంచ దేశాలకు వెళ్తున్నప్పటికీ ఏ ఒక్కరూ కూడా ఈ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోకుండానే వస్తున్నారు.ఇలాంటి పరిస్థితులలో ఈ సమస్యకు ఒక మంత్రిత్వ శాఖ అనేది కచ్చితంగా అవసరం అంటూ మైఖేల్ అన్నారు.

అయితే 2017లో గోవాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి లోబో కీలక పాత్ర పోషించారు.అయితే లోబో సహకారం తో అధికారంలోకి వచ్చినప్పటికీ లోబో కి ఎలాంటి కీలక పదవి కట్టపెట్టాక పోవడం తో ఆయన సొంత పార్టీ పైనే పలు ఆరోపణలు చేశారు.దీనితో ఇటీవల లోబో పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న గోవా సి ఎం లోబో కు ప్రభుత్వం పెద్ద పదవి ఇస్తామంటూ ప్రకటించారు.అయితే ఆయన ప్రకటించినప్పటికీ ఇంతవరకు లోబో కు ఎలాంటి పదవి దక్కకపోవడం తో ఆయన మరోసారి పై విధంగా తన అసహనాన్ని వ్యక్తపరిచారు.