ఆడ బిడ్డలకు భరోసాగా కళ్యాణ లక్ష్మి..?

నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదు అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే నూతన పథకానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సుల్తానాబాద్ మండల కార్యాలయంలో 25 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డలకు భోరోసాగా నిలుస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినప్పటికీ నిరుపేదల ఆడపిల్లల పెళ్లికి చేయూతనిచ్చే విధంగా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చారని ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా మానేరు పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రజలందరికీ హామీ ఇచ్చారు.అయితే మానేరు వాగు గ్రామాల ప్రజలందరికీ ఇసుకను ఉచితంగా ఇచ్చేందుకు ఎంతగానో కృషి చేసిన ఎమ్మెల్యే కి సర్పంచ్ ఫోరమ్ మండల అధ్యక్షుడు తో పాటు స్థానిక సర్పంచులు అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు