MLA Lasya Nandita : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహం..!

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత( MLA Lasya Nandita ) మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి( Gandhi Hospital ) తరలించారు.

పోస్టుమార్టం తరువాత ఆమె మృతదేహాన్ని కంటోన్మెంట్ నివాసానికి తరలించనున్నారు.

మరోవైపు గాంధీ ఆస్పత్రిలో లాస్య కుటుంబ సభ్యులను మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్ పరామర్శించారు.ఆమె మరణవార్త తెలుసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు లాస్య నివాసానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

అయితే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందితను ప్రమాదాలు వెంటాడుతున్నాయి.ఎమ్మెల్యేగా విజయం సాధించిన లాస్య ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా లిఫ్ట్ లో చిక్కుకుని పోగా .సిబ్బంది ఆమెను కాపాడారు.తరువాత ఈనెల 13న నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ సభలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో లాస్య కారు ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదం నుంచి లాస్య నందిత బయటపడిన సంగతి తెలిసిందే.తాజాగా ఇవాళ తెల్లవారుజామున పటాన్ చెరు సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో లాస్య మృత్యువాత పడ్డారు.తండ్రి సాయన్న మార్గంలోనే లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చారు.

Advertisement

సాయన్న( Sayanna ) ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆమె కార్పొరేటర్ గా కొనసాగారు.ఆ తరువాత సాయన్న అనారోగ్యంతో మరణించారు.

అనంతరం లాస్య నందితకు బీఆర్ఎస్ కంటోన్మెంట్ టికెట్ ఇచ్చింది.కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున బరిలో దిగారు.

కాంగ్రెస్ అభ్యర్థి గద్దర్ కుమార్తె వెన్నెలపై విజయం సాధించి లాస్య ఎమ్మెల్యే అయ్యారు.

మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్.. క్లీంకార పుట్టాక అంతా శుభమే!
Advertisement

తాజా వార్తలు